డిఫరెంట్ హర్రర్ మూవీ అవసరానికో అబద్ధం - డైరెక్టర్ సురేష్ కె.వి.
Send us your feedback to audioarticles@vaarta.com
లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి, సందీప్, వెంకీ, ఎం.జి.ఆర్, గిరిధర్, విజయ్ ప్రధాన పాత్రధారులుగా నూతన దర్శకుడు సురేష్ కె.వి తెరకెక్కించిన చిత్రం అవసరానికో అబద్ధం. ఈ చిత్రాన్ని విజయ్, పులి శ్రీకాంత్, సందీప్ సంయుక్తంగా నిర్మించారు. హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందిన అవసరానికో అబద్ధం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 26న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేష్ కె.వి మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం. దర్శకుడిగా సినిమా తీయాలనే నా లక్ష్యం గురించి నా ఫ్రెండ్స్ కి చెప్పగానే బాగా ప్రొత్సహించారు. కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాను. నేను జాబ్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే....హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందించిన చిత్రమిది. నువ్వు నిజం అని నమ్మింది నీకు నిజం అని చెప్పింది ఎవరు..? నువ్వు అబద్దం అనుకునేది అబద్ధం అని చెప్పింది ఎవరు..? అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాను. నలుగురు కుర్రాళ్లు, అడవి నేపధ్యంలో చాలా సినిమాలు వచ్చి ఉండచ్చు. కానీ..మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది.
నాకు శ్రీశ్రీ, సీతారామశాస్త్రి, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పూర్తి. సినిమా పూర్తయిన తర్వాత ట్రైలర్ త్రివిక్రమ్ గారికి చూపిద్దాం అని ట్రైలర్ తో పాటు రెండు పోస్టర్స్ పంపించాను. ఆతర్వాత త్రివిక్రమ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ చేస్తామంటున్నారు త్రివిక్రమ్ గారు రమ్మంటున్నారు అని చెప్పారు. మేము అసలు ఊహించలేదు. ట్రైలర్ చూసి బాగుంది అని మెచ్చుకుని కొన్ని సలహాలు చెప్పారు. ఓ ఇరవై నిమిషాలు త్రివిక్రమ్ గారు మాతో మాట్లాడారు. ఆ సంఘటనను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఈనెల 26న 80 స్ర్కీన్స్ లో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments