దాడులు చేస్తే ఊరుకోం.. అన్నీ చోట్లా వైసీపీదే గెలుపు!!
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డిపై దాడితో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే మీడియా ముందుకొచ్చి ఈ విషయం మాట్లాడిన వైసీపీ నేతలు.. దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తామంటే మేం చూస్తూ ఊరుకోం... మేం అధికారంలో ఉన్నామని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రాజధానితో సంబంధమేంటి!?
ఈ సందర్భంగా రాజధాని, స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మంత్రి మాట్లాడారు. ‘మూడు రాజధానుల నిర్ణయాన్ని స్థానికసంస్థల ఎన్నికలను రెఫరెండంగా భావించలేం. మూడు రాజధానుల అంశం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపబోదు. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలే కీలకంగా పనిచేస్తాయి. పలాసలో ఉన్న వారికి, అనంతపురంలో ఉన్న వారికి రాజధానితో సంబంధమేంటి!?. రాజధాని రైతులకు మేలు చేసే నిర్ణయాలనే సీఎం వైఎస్ జగన్ తీసుకుంటారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అన్ని చోట్లా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. చంద్రబాబులా మా ప్రభుత్వం పూటకు ఓ మాట చెప్పదు. గత ఎన్నికల ఫలితాల లాగానే స్థానిక ఎన్నికల ఫలితాలూ ఉంటాయి’ అని అవంతి ధీమా వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments