ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సుల తో ప్రారంభమైన 'ఆటో రజని' చిత్రం

  • IndiaGlitz, [Saturday,October 12 2019]

Jsr మూవీస్ పతాకం పై బి.లింగుస్వామి సమర్పణ లో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఆటో రజని ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా తో తన డాన్స్ లతో ,యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఆటో రజని.

జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ సినిమా గా వస్తున్న ఈ సినిమా కు ఆంద్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందించారు ..ఆయన ఎంతో బిజీ గా ఉండి కూడా ఇండస్ట్రీలో కి కొత్తగా వచ్చిన మా హీరోకి ఆయన బ్లెస్సింగ్స్ ఉండటం ఆనందంగా ఉంది అన్నారు దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్. ఈ శుక్రవారం సాయంత్రం తాడేపల్లి లోని వైస్సార్సీపీ కార్యలయం లో వైస్ జగన్ కలసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు జొన్నలగడ్డ హరికృష్ణ.

ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రం గా మా ఆటో రజని నిలిచిపోతుంది అన్నారు దర్శక, నిర్మాతలు. అంతే కాకుండా ఎలెక్షన్ టైం లో మేము చేసిన 'జననేత జగనన్న' పాట గురించి ప్రత్యేకం మమ్ములను జగనన్న అభినందించడం జీవితంలో మర్చిపోలేము అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. హీరోయిన్ ,ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో తెలియ జేస్తామన్నారు..దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్.

More News

తెలుగు రాష్ట్రాల్లోనూ నదులు కలుషితం.. పవన్ ఆవేదన

గంగా నదే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ కోసం ముంబైకి వరుణ్!

వైవిధ్యమైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను సంపాదించుకున్నారు మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌.

శివసేన మేనిఫెస్టోకు జనాలు ఫిదా.. ఓట్ల సంగతేంటో!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా...

చంద్రబాబు.. శోభన్ బాబా?.. మందు అలవాటైందేమో!?

కేవలం నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు, అనేక చట్టాలు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారని..

రెండో షెడ్యూల్‌లో 'ఒరేయ్‌.. బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో