ఆసుపత్రిలో లతా మంగేష్కర్.. ఆటో డ్రైవర్ త్యాగం, ఏం చేశాడంటే..?

  • IndiaGlitz, [Sunday,January 23 2022]

దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్(92) కరోనా బారినపడటంతో ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యంపై మీడియాతో రకరకాల వదంతులు వస్తున్నాయి. కాగా.. లతా మంగేష్కర్ వీరాభిమాని ఒకరు ఆమె పట్ల అభిమానం చాటుకున్నారు. చిన్నప్పటి నుంచి లతాజీ అంటే ప్రాణమిచ్చే ఆయన.. ఇప్పుడు కోసం తన సంపాదనను ఆమె కోసం దానం చేస్తున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న సత్యవాన్ తన ఆటోలో కూడా పూర్తిగా లతా మంగేష్కర్‌ బొమ్మలతో నింపేశాడు.

కాగా తన ఇంటిలో పనిచేసే సిబ్బందిలో ఒకరి నుంచి లతాజీ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా ప్రకటన చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని అన్నారు. లతా మంగేష్కర్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. ‘లతా ఆరోగ్యంపై వదంతులను ఆపమని’ వైద్యులు అభ్యర్థించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని తెలిపారు.

లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం లతా న్యుమోనియాతో బాధపడుతున్నారు. నాటి నుంచి ఆమెకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. వృద్ధాప్యం కారణంగా లతాజీ కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. లతా కుటుంబ సభ్యుల సందేశాన్ని ఈ సందర్భంగా స్మృతి వివరించారు.

More News

స్టార్ మా లో 'కామెడీ స్టార్స్ ధమాకా' !!

కామెడీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా.. నవ్వించడంలో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ స్టార్ మా కామెడీ స్టార్స్ ని కొత్త గా తీర్చి దిద్దింది.

యూత్‌ఫుల్‌గా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్తదనంతో నిండిన సినిమాలు చేస్తూనే వుంటారు యువ హీరో సుధీర్ బాబు.

అన్న రమేశ్ బాబు దశ దిన కర్మకు హాజరైన మహేశ్ బాబు

సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు (56) ఈ నెల 8న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

లగడపాటి విక్రమ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ రిలీజ్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి.

హ్యాపీ బర్త్ డే టూ నాగశౌర్య.. పుట్టినరోజు కానుకగా ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్‌లుక్

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు యంగ్ హీరో నాగశౌర్య. కొత్తదనం నిండిన కథలతో యువతను ఆకట్టుకుంటున్నారాయన. గతేడాది వరుడు కావలెను సినిమాతో మంచి విజయాన్ని