ఇండియా నుంచి వస్తే ఐదేళ్ల జైలు: ఆస్ట్రేలియా ప్రభుత్వం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధన విధించింది. ఇండియాలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో మన దేశ పరిస్థితిని చూసిన ఇతర దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. దీంతో తమ దేశ పౌరులకు కఠిన నిబంధనలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు విస్తుగొలుపుతున్నాయి.
సిద్దార్థ్‌ను పట్టించుకోకండి.. టైమ్ పాస్ కోసం ఆరోపణలు చేస్తారు: బీజేపీ
భారత్ నుంచి తమ దేశానికి ఎవ్వరూ రావొద్దని తాత్కాలిక బ్యాన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించింది. భారత్‌లో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు.. దేశంలో అడుగు పెడితే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష లేదంటే సుమారు 49 లక్షల జరిమానా విధిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధన నేటి(మే 1) నుంచే అమల్లోకి రానుంది. తమ దేశంలోకి కరోనా మహమ్మారిని రాకుండా చూసుకునేందుకు ఎంతటి కఠిన చర్యలకైనా ప్రభుత్వం వెనుకాడటం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout