న్యాయ పోరాటానికి దిగిన ఆస్ట్రేలియా ఆటగాడు

ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌ పరిహారం కోసం న్యాయ పోరాటానికి దిగాడు. లడన్ కు చెందిన లాయిడ్ అనే సంస్థపై దావా వేశాడు. తనకు 10 కోట్ల 39 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. గతేడాది ఐపీఎల్ లో అత్యధిక వేలం పలికిన ఆటగాళ్లలో ఒక్కడైన స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 12 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది.

అయితే ఒక వేళ గాయం, ఇతరత్ర కారణాలతో ఐపీఎల్ ఆడకపోతే.... తనకు భీమా చెల్లించాలని లాయిడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 68 లక్షల ప్రీమియం కూడా చెల్లించాడు. అయితే ఐపీఎల్ కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో తగిలిన గాయం .. స్టార్క్ ను ఐపీఎల్ ఆడకుండా చేసింది.

గాయం తీవ్రతతో ఐపీఎల్ కు పూర్తిగా దూరంగా ఉన్నాడు. కానీ లాయిడ్ సంస్థ తనకు భీమా చెల్లించలేదని న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. తనకు రావాల్సిన 10 కోట్లకు పైగా మొత్తాన్ని వెంటనే కట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.

More News

ఓట్ల పండక్కి కిక్కిరిసిన పోయిన బస్సులు, రైళ్లు

ఓట్ల పండగ రావడంతో ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు.  ఈ నెల 11న పోలింగ్ ఉండడంతో ఓటేసేందుకు జనాలు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్ లు కిక్కిరిసిపోయాయి.

ఉన్న‌ట్టా... లేన‌ట్టా...

నాగ‌శౌర్య హీరోగా మొద‌లైన ఓ చిత్రం ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

విజ‌య్ ఎమోష‌న‌ల్

విజ‌య్ దేవ‌ర‌కొండ లేటెస్ట్ గా ఓ సినిమాకు సంత‌కం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎమోష‌న‌ల్‌గా సాగుతుంద‌ట‌.

జగన్ అంటే వ్యక్తిగతంగా కోపాల్లేవ్..: పవన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు వ్యక్తిగతంగా కోపాల్లేవ్.. కక్షల్లేవ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

టీడీపీకి ఓటేయండి..: హీరోయిన్ సమంత

ఇదేంటి టైటిల్ చూడగానే షాకయ్యారా..? అవును మీరు వింటున్నది నిజమే. అదేంటి అక్కినేని ఫ్యామిలీ వైసీపీలో ఉందిగా మళ్లీ ఈ సడన్ ట్విస్ట్ ఏంటని అనుకుంటున్నారేమో..