ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ఐపీఎల్ పరిహారం కోసం న్యాయ పోరాటానికి దిగాడు. లడన్ కు చెందిన లాయిడ్ అనే సంస్థపై దావా వేశాడు. తనకు 10 కోట్ల 39 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. గతేడాది ఐపీఎల్ లో అత్యధిక వేలం పలికిన ఆటగాళ్లలో ఒక్కడైన స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 12 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది.
అయితే ఒక వేళ గాయం, ఇతరత్ర కారణాలతో ఐపీఎల్ ఆడకపోతే.... తనకు భీమా చెల్లించాలని లాయిడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 68 లక్షల ప్రీమియం కూడా చెల్లించాడు. అయితే ఐపీఎల్ కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో తగిలిన గాయం .. స్టార్క్ ను ఐపీఎల్ ఆడకుండా చేసింది.
గాయం తీవ్రతతో ఐపీఎల్ కు పూర్తిగా దూరంగా ఉన్నాడు. కానీ లాయిడ్ సంస్థ తనకు భీమా చెల్లించలేదని న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. తనకు రావాల్సిన 10 కోట్లకు పైగా మొత్తాన్ని వెంటనే కట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.