'నీ జతలేక' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నాగశౌర్య, పారుల్ హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `నీ..జతలేక`. లారెన్స్ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజుగౌడ్ చిర్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, సి.కల్యాణ్, ప్రతాని రామకృష్ణగౌడ్, సాగర్, హరినాథరావు, చమన్, పారుల్, సరయు, మాడభూసి రాఘవ్, జిహెచ్ఎమ్‌సి కమీషనర్ పి.జనార్ధన్ రెడ్డి, కె.పి.చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎన్.శంకర్ ఆడియో సీడీలను విడుదల చేసి సి.కల్యాణ్‌కు తొలి సీడీని అందించారు. ఈ సందర్భంగా...
సి.కల్యాణ్ మాట్లాడుతూ ``చాలా మంచి టైటిల్. కథలో మంచి ఫీలింగ్ ఉన్నట్లు కనపడుతుంది. నాగశౌర్య, సరయు, పారుల్ చక్కని నటనను కనపరిచారు. దర్శకుడు దాసరి లారెన్స్‌కు మంచి బ్రేక్ అవుతుంది. స్వరాజ్ సంగీతం బావుంది. నిర్మాతలకు అభినందనులు. సినిమా మచి ఫీల్‌గుడ్ మూవీగా సూపర్‌హిట్ సాధిస్తుంది`` అన్నారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ ``ఇప్పుడు బ్రేకప్‌లు, ప్యాచప్‌లు అవుతున్నాయి. సినిమాకు మంచి పేరు తెచ్చే సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. దర్శకుడు లారెన్స్ దాసరి, నిర్మాతలు ఈ సినిమా సక్సెస్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకంటున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నిర్మాత జివి.చౌదరి మాట్లాడుతూ ``నేను ఈ బ్యానర్లో మరిన్ని మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. వచ్చే రెండు మూడేళ్లలో వినాయక్ దర్శకత్వంలో మహేష్‌తో వందకోట్ల సినిమా, ఎన్టీఆర్‌తో వందకోట్ల సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాను. నేను అనంతపురానికి చెందినవాడినైనా హరినాథరావుగారు నన్ను ముందుండి నడిపిస్తున్నారు. సినిమాను అందరం కష్టపడి చేశాం. తప్పకుండా సినిమా మంచి పేరు సంపాదించుకుంటుంది`` అన్నారు.
నిర్మాత నాగరాజుగౌడ్ చిర్రా మాట్లాడుతూ ``దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమాను చేశాం. ఈ బ్యానర్లో మరిన్ని సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సంగీత దర్శకుడు స్వరాజ్ మంచి ట్యూన్స్ అందించాడు. అందరం కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా`` అన్నారు.
దర్శకుడు లారెన్స్ దాసరి మాట్లాడుతూ ``నిర్మాతలు సినిమాను చేసే సమయంలో చాలా అండగా నిలబడ్డారు. అలాగే నాగశౌర్య, పారుల్, సరయులకు మంచి పేరు తెస్తుంది. స్వరాజ్ మంచి సంగీతం అందించగా, కరుణాకరణ్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సంగీత దర్శకుడు స్వరాజ్ మాట్లాడుతూ ``దర్శకుడు లారెన్స్ దాసరిగారికి మ్యూజిక్ పట్ల మంచి అవగాహన ఉంది. దాంతో నా నుండి మంచి సంగీతాన్ని రాబట్టుకున్నారు. మంచి లవ్ స్టోరీకి మ్యూజిక్ చేసే అవకాశాన్నిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
నాగశౌర్య, పారుల్ గులాటి, విస్సురెడ్డి, జయలక్ష్మీ, ఆర్క్ బాబు, నామాలమూర్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వరాజ్, సినిమాటోగ్రఫీ: బుజ్జి కె., మాటలు: శేఖర్ విఖ్యాత్, ఎడిటింగ్: నందమూరి హరి, ఆర్ట్: సత్య, పాటలు: రామ్ పైడిశెట్టి, గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.శ్రీధర్, సమర్పణ: ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు, నిర్మాతలు: జి.వి.చౌదరి, నాగరాజుగౌడ్ చిర్రా, దర్శకత్వం: లారెన్స్ దాసరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments