Bhuvaneswari: దళితులపై భువనేశ్వరి బూతుల ఆడియో నిజమే.. ఫేక్ కాదని నిర్థారణ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికలు తారాస్థాయికి చేరాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. ఓవైపు అధికార వైసీపీ సభలకు ప్రజలు పోటెత్తుతుంటే.. టీడీపీ కూటమి సభలకు ప్రజల నుంచి స్పందన లేదు. దీంతో టీడీపీ నేతల్లో ఓటమి భయం కనపడుతోంది. ఈ క్రమంలో తమ నోటికి పనిచెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. దళితులను పచ్చి బూతులు మాట్లాడినట్టుగా ఒక ఆడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.
అయితే డీప్ ఫేక్ ఆడియో అని టీడీపీ స్పందించింది. అందులో ఉన్న వాయిస్ భువనేశ్వరిది కాదని కొట్టిపారేసింది. వైసీపీ ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తోందంటూ మండిపడింది. కానీ తాజాగా భువనేశ్వరి ఆడియో డీప్ ఫేక్ కాదని కేంద్రానికి చెందిన డీప్ ఫేక్స్ అనాలసిస్ యూనిట్ ప్రకటించిందని తెలుస్తోంది. దీంతో ఇది వైసీపీ చేసిన ప్రచారం కాదని నిజమేనని తేలిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దళితులు టీడీపీ నేతలపై మండిపడుతున్నారు.
భువనేశ్వరి మాట్లాడిన ఆ ఆడియోలో దళితుల కులం పుట్టుక గురించి చాలా దారుణంగా మాట్లాడినట్టుగా ఉంది. "నేను నీకంటే పెద్ద ఇంట్లో పుట్టిన దాన్ని.. మీరు చెత్త బుట్టలో పుట్టారు.. అయినా వేషాలు వేస్తున్నారు.. దేనికి పనికిరాని అడుక్కుతినే వెధవల్లారా అంటూ... నానా బూతులు తిడుతోంది భువనేశ్వరి. నేను మీ అందరిని మానిటరింగ్ చేస్తానా.. తప్పుడు నా కొడకా.. ఉడికం చేసే వెధవ.. పనికిరాని.. ల..కొడుకా.. ముష్టి నా కొడకా" అంటూ పచ్చి బూతులు ఉన్నాయి. దీంతో ఆమె మాటలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కాగా టీడీపీ నేతలకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపు అని ఫైర్ అవుతున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దళితుల పట్ల ఇంత వివక్ష చూపిస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
The audio embedded with the following tweet is #not a #deepfake : https://t.co/8sYp7T70CH
— Deepfakes Analysis Unit (@dau_mca) April 27, 2024
We escalated this audio to two of our expert partners for analysis. Dr. Hany Farid's #forensic lab confirmed that the audio was not produced using #GenAI. They used automated and manual…
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com