తిక్క సినిమాలో న‌న్ను చూసి ఆడియోన్స్ షాక్ అవుతారు - హీరోయిన్ మ‌న్నారా చోప్రా

  • IndiaGlitz, [Tuesday,August 09 2016]

సాయిధ‌ర‌మ్ తేజ్, మ‌న్నారా చోప్రా, లెరిస్సా హీరో, హీరోయిన్స్ గా ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన తిక్క చిత్రాన్ని ఈనెల 13న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తిక్క హీరోయిన్ మ‌న్నారా చోప్రా తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

తిక్క చిత్రంలో న‌టించారు క‌దా...! ఈ చిత్రం మీకు ఎలాంటి ఎక్స్ పీరియ‌న్స్ ఇచ్చింది..?

తిక్క చిత్రంలో న‌టించ‌డం గ్రేట్ ఎక్స్ పీరియ‌న్స్ ఇచ్చింది. హైద‌రాబాద్, మ‌లేషియాల్లో షూటింగ్ చేసాం. ఈ చిత్రంలో సీనియ‌ర్ ఏక్ట‌ర్స్ తో క‌లిసి న‌టించడం మ‌ర‌చిపోలేని అనుభూతి. ఈ చిత్రంలో రెగ్యుల‌ర్ గా కాకుండా డిఫ‌రెంట్ రోల్ చేసాను. ప్రేక్ష‌కుల నుంచి ఎలా స్పంద‌న వ‌స్తుందో అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నాను.

హీరో తేజు మంచి డ్యాన్స‌ర్..తేజుతో డ్యాన్స్ చేస్తుంటే ఏమ‌నిపించింది..?

తేజు చాలా మంచి డ్యాన్స‌ర్. నాకు కూడా డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. కానీ...ఈ చిత్రంలో నేను తేజుతో క‌లిసి డ్యాన్స్ చేయ‌లేదు.

డ్యాన్స్ అంటే ఇష్టం ఉండి తేజుతో డ్యాన్స్ చేయ‌క‌పోవ‌డానికి ప్ర‌త్యేక‌మైన‌ కార‌ణం ఉందా..?

అవును..! స్పెష‌ల్ రీజ‌న్ ఉంది.

డ్యాన్స్ చేయ‌కుండా ఫైట్స్ చేసారా..?

అవ‌న్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా..? స‌్ర్కీన్ పై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. అయినా స‌రే..మీరు అడిగారు కాబ‌ట్టి చెబుతున్నాను. డ్యాన్స్ లు కాకుండా మీరు ఊహించిన‌ట్టుగా ఫైట్స్ చేసాను. తెర పై న‌న్ను చూసి ఆడియోన్స్ షాక్ అవుతారు అనుకుంటున్నాను.

ఫైట్స్ చేసాను అంటున్నారు క‌దా...యాక్ష‌న్ సీన్స్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు..?

నాకు ఫైట్స్ గురించి పెద్ద తెలియ‌దు అందుచేత డైరెక్ట‌ర్ ఎలా చెబితే అలా చేసాను అంతే..!

ఇంత‌కీ...ఈ చిత్రంలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

నా క్యారెక్ట‌ర్ చాలా సీరియ‌స్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే..ఈ సినిమాలో నేను ఒక‌ర్ని చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాను. అది ఎవ‌ర్ని అనేది స్ర్కీన్ పై చూడాల్సిందే (న‌వ్వుతూ..)

సాయిధ‌ర‌మ్ తేజ్ తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?

తేజు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తుంటాడు. ఆన్ స్ర్కీన్ పంచ్ డైలాగ్స్ చెబుతూ...ఫైట్స్ చేస్తూ క‌నిపిస్తాడు కానీ..ఆఫ్ స్ర్కీన్ చాలా సాఫ్ట్ గా ఉంటాడు

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తో క‌లిసి న‌టించారు క‌దా..మిగిలిన మెగా హీరోలతో కూడా న‌టించాల‌నుకుంటున్నారా..?

అవును...మిగిలిన మెగా హీరోలంద‌రితో న‌టించాల‌ని వెయిట్ చేస్తున్నాను. ఆ అవ‌కాశం ఎప్పుడో వ‌స్తుందో చూడాలి.

మీరు ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారు..?

డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాల‌నివుంది. అలాగే శ్రీదేవి, మాధూరి దీక్షిత్ లా గ్లామ‌ర్ & ప‌ర్ ఫార్మెన్స్ స్కోప్ క్యారెక్ట‌ర్స్ చేయాలి అనుకుంటున్నాను.

ప్రియాంక చోప్రా మీ క‌జిన్ అని విన్నాం నిజ‌మేనా..?

అవును..! నిజ‌మే. త‌ను మంచి క్యారెక్ట‌ర్ చేస్తే త‌న‌ని నేను అభినందిస్తాను...నేను మంచి క్యారెక్ట‌ర్ చేస్తే న‌న్ను త‌ను అభినందిస్తుంటుంది. త‌ను న‌న్ను బాగా ఎంక‌రేజ్ చేస్తుంటుంది. నాకు గైడ‌న్స్ ఇస్తూ న‌న్ను ఎంత‌గానో ప్రొత్స‌హిస్తున్న ప్రియాంక‌కు ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రోగ్ చిత్రంలో న‌టిస్తున్నాను. రెండు మూడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా దాదాపు షూటింగ్ పూర్త‌య్యింది. అక్టోబ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

మ‌హేష్ ది ప‌క్కా అయ్యింది

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌కు బ్ర‌హ్మోత్స‌వం ఇచ్చిన ప‌రాజ‌యం ఓ ర‌కంగా చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ తో పాటు నిర్మాత కూడా భారీగా న‌ష్ట‌పోయాడు.

గీతాఆర్ట్స్ లో ప‌రుశురాంకు మ‌రో అవ‌కాశం

యువ‌త‌, సోలో చిత్రాలు త‌ర్వాత డైరెక్ట‌ర్ ప‌రుశురాంకు ఆంజ‌నేయులు, సారొచ్చారు చిత్రాలు ఆశించినంత స‌క్సెస్‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. 2012 త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప‌రుశురాం నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత చేసిన సినిమాయే శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు.

అభిమానధనుడు..శ్రీమంతుడు..హ్యాపీ బర్త్ డే టు మహేష్..

హీరో కోట్లకు పడగలెత్తాడు, అయినా తనకు సింపుల్‌గా ఉండాలంటేనే ఇష్టం. కష్టాల్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని దాని రూపు రేఖలు మార్చేస్తాడు. ఈ కథ వినడానికి సంపుల్‌గా ఉంది కదా..అని ఎవరైనా అనుకుంటారు. కానీ సూపర్‌స్టార్‌ మహేష్‌ అలా అనుకోలేదు.

బొమ్మ‌రిల్లు కు ప‌ది వ‌సంతాలు

భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం 2006, ఆగ‌స్ట్ 9న విడుద‌లై నేటికి స‌రిగ్గా ప‌ది వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటుంది.

అవసరానికో అబద్ధం రిలీజ్ కి రెడీ

లోకేష్,శశాంక్,రాజేష్ ప్రధాన పాత్రలో కె.వి.సురేష్ తెరకెక్కించిన చిత్రం అవసరానికో అబద్ధం.