‘నిశ్శబ్దం’ రిలీజ్ విషయంలో ప్రేక్షకుల రెస్పాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’. ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా దెబ్బకు వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్ తగ్గిపోతుందిలే.. సమ్మర్కైనా వచ్చేస్తామని ‘నిశ్శబ్దం’ యూనిట్ భావించారు. కానీ తీరా.. కరోనా ఎఫెక్ట్ తగ్గకపోవడంతో థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో.. సమ్మర్ కూడా పూర్తయ్యింది. ఈలోపు స్టార్ హీరోలు, మీడియం బడ్జెట్ హీరోల సినిమాలు లైన్లోకి వచ్చేశాయి. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ విడుదలపై నిర్మాతలు క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. సరే! కరోనా వైరస్ తగ్గే వరకు వెయిట్ చేద్దామంటే.. ఎప్పటికీ పరిస్థితులు సద్దుమణుగుతాయనే దానిపై క్లారిటీ లేదు. తాజాగా నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ప్రేక్షకులకు ఓ ఆసక్తికరమైన ప్రశ్నను వేశారు. ‘నిశ్శబ్దం’ సినిమాను థియేటర్లో చూడాలనుకుంటున్నారా? లేక ఓటీటీలో చూడాలనుకుంటున్నారా? అనే ప్రశ్నను ట్విట్టర్ ద్వారా సినీ అభిమానులను అడిగారు.
అయితే ప్రేక్షకుల వైపు నుండి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. 29 శాతం మంది ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని థియేటర్లో చూడాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే 56 శాతం మంది ఓటీటీకే ఓటేశారు. దీంతో థియేటర్స్లో సినిమాను విడుదల చేయాలని ఎదురుచూస్తున్న నిర్మాతలకు ‘నిశ్శబ్దం’విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్లయ్యింది. మరిప్పుడు నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com