యూట్యూబ్ ని ఊపేసే పాట.. బిగ్ బాస్ దివి హాట్ నెస్ అదుర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
తన గ్లామర్, ట్రెండీ అప్పియరెన్స్ తో క్రమంగా క్రేజ్ పెంచుకుంటోంది బిగ్ బాస్ దివి. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటోంది దివి. వెబ్ సిరీస్ లు,సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో దివి రాణిస్తోంది. టాలీవుడ్ లో దివి ఫ్యూచర్ గ్లామర్ క్వీన్ గా ప్రశంసలు దక్కించుకుంటోంది.
తాజాగా దివి తెలంగాణ జానపద ఫ్లేవర్ తో చేసిన ఓ సాంగ్ విడుదలయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సాంగ్ కేకపెట్టించే విధంగా ఉంది. సాంగ్ బీట్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంటే.. దివి అందాలు, అదిరిపోయే స్టెప్పులు మతిపోగొడుతున్నాయి.
పల్లెటూరి యువతిగా దివి అందాలు ఆరబోస్తూ ఈ సాంగ్ లో పెర్ఫామ్ చేసింది. కాసర్ల శ్యామ్ ఈ సాంగ్ కు లిరిక్స్ అందించారు. 'సిలక ముక్కు దానా' అంటూ సాగె ఈ పాటకు మదీన్ సంగీతం అందించారు. యువ సింగర్ హారిక నారాయణ్ అద్భుతంగా ఈ పాటని పాడింది.
దివి గ్లామర్, సాంగ్ బీట్ చూస్తుంటే ఈ పాట యూట్యూబ్ ని దున్నేసేలా కనిపిస్తోంది. ఇక దివి ఇటీవల క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. టైమ్స్ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా టీవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది ఈ యంగ్ బ్యూటీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com