ఫిలిం మేకర్స్ కంటే ఆడియెన్స్ తెలివైనవాళ్లు - హీరో సూర్య
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ 24`. ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 6న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సూర్యతో ఇంటర్వ్యూ....
24 టైటిల్ ఎందుకు పెట్టారు...
75 కోట్ల ఖర్చు పెట్టి సినిమా తీశాం. మరి 24 టైటిల్ మీనింగ్ తెలుసుకోవాలంటే థియేటర్ కు రావాల్సిందే. ఆ నెంబర్ కు ఓ కనెక్టివిటీ అయితే ఉంది. అదేదో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
సైన్స్ ఫిక్షన్ పై మీరు చేస్తున్న మూడో సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ సినిమా చేయాలని ఎందుకనిపించింది?
నేను డిఫరెంట్ కంటెంట్ సినిమాలు చేయాలని అనుకుంటాను. నేనెవరినీ తక్కువ చేసి మాట్లాడను. సాధారణంగా ఎన్నో కమర్షియల్ సినిమాలను చూస్తుంటాం. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి ఉంటాయి. అయితే సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ ను ఎంత మంది ఇంటి వరకు క్యారీ చేస్తారు. తెలుగు సినిమా విషయానికి వస్తే శంకరాభరణం, బాహుబలి, ఈగ, మనం, రీసెంట్ గా విడుదలైన ఊపిరి ఇలాంటి సినిమాలు కూడా పెద్ద హిట్స్ సాధించాయి. ఈ చిత్రాలను మన పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూశాం. మనం చాలా సినిమాలను చూస్తే అవి హద్దులను దాటి సినిమా అంటే ప్రాంతాలకు పరిమితం కావని రుజువు చేశాయి. ఇలాంటి సినిమాలను చూస్తున్నప్పుడు ఉన్న ఫీల్ ను క్యారీ చేయడం నాకు బాగా ఇష్టం. అలాగని నేనేదో గొప్ప సినిమాలు చేస్తున్నానని కాదు. ఇలాంటి కంటెంట్ సినిమాలు రావాలి. 24 వంటి కంటెంట్ ఉన్న సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆదిత్య 369, మిష్టర్ ఇండియా వంటి సినిమాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. అలాంటి కోవకు చెందిన సినిమాయే 24. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా ఎగ్జయిట్ మెంట్ తో ఈ సినిమా కోసం వర్క్ చేశారు. అలాగని ఇదేదో క్లిష్టమైన పాయింట్ తో తెరకెక్కిన సినిమా కాదు, మనం వంటి ఓ పాయింట్ ను సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎలా తెరకెక్కించారో ఈ సినిమా కూడా అలా ఉంటుంది. ఉదాహరణ చూసుకుంటే గజినీ సినిమాలో నేనొక మతిమరుపు ఉన్న పెషెంట్ పాత్ర చేసినా, అందులో మంచి లవ్ స్టోరీ ఉంది. అది అందరికీ నచ్చింది. అలాంటి డిస్నీ కంటెంట్ తో, ఫ్యామిలీ సహా అందరూ చూసే సినిమా.
సినిమాలో మూడు పాత్రల్లో నటిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇలాంటి సందర్భంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండేది?
ఈ సినిమాలో నటిస్తూ, నిర్మించడం అనే భావన చాలా హ్యపీగా, గర్వంగా అనిపించింది. కంటెంట్ అంత స్ట్రాంగ్ ఉంది. సినిమాను ఫుటేజ్ ను రీరికార్డింగ్ లేకుండా చూశాను. రెహమాన్ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్నాను. నేనే కాదు, యూనిట్ అంతా ఫైనల్ కంటెంట్ చూసి గర్వంగా ఫీలయ్యాం. విక్రమ్ చెప్పిన దాని కంటే బాగా చేశాడనిపించింది.
దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తో సినిమా ఎలా సెట్ అయ్యింది?
విక్రమ్ చాలా క్రియేటివ్ పర్సన్. చాలా కొత్త ఆలోచనలతో ఉంటాడు. తనని నేను వదలి పెట్టాలనుకోవడం లేదు. కుదిరితే ప్రతి ఏడాది తనతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. తను ఎమోషన్స్ రియల్ గా ఉంటాయి. విక్రమ్ తెలుగులో ఇష్క్, మనం వంటి రెండు సూపర్ హిట్ మూవీస్ చేసి ఉన్నారు. మనం సినిమ చూసిన తర్వాత ఆ సినిమాను తమిళంలో చేయాలని అనుకున్నాం కానీ నా మైండ్ లో రెండు ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. మనం చిత్రాన్ని ఎందుకు రీమేక్ చేయాలి, కొత్త కథతో సినిమా చేయవచ్చు కదా, ఒకవేళ విక్రమ్ కలిస్తే మనం కాకుండా కొత్త సినిమా కథ చెప్పమని అడుగుదామని అనిపించింది. అలాంటి సమయంలో విక్రమ్ తో మీటింగ్ జరిగింది. నేను ఏదైతే అనుకున్నానో విక్రమ్ కూడా అలాగే సార్...నేను మనం కథ చెప్పను, కొత్త కథ చెబుతాను` అన్నారు. ఆరగంట అపాయింట్ మెంట్ తీసుకుని వచ్చిన విక్రమ్ నాలుగున్నర గంటల పాటు ఈ కథను కనీసం నీళ్లు కూడా తాగకుండా నెరేట్ చేశారు. అంతా విన్న తర్వాత నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. కథ ఫాంటసీ అయినా, ఇండియన్ సినిమా. హాలీవుడ్ నుండి కాపీ కొట్టిన సినిమా కాదు. మంచి టీం కుదిరింది. ఇలాంటి సినిమాకు నిర్మాతగా ఉండటాన్ని ఎంజాయ్ చేశాను. క్రిష్ 3, బాజీరావు మస్తానీ వంటి సినిమాలకు పనిచేసిన మేకప్ మ్యాన్, మంచి ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఇలా బెస్ట్ టీం కుదిరింది. సినిమాలో పాత్రల విషయానికి వస్తే సినిమాకు ఆత్రేయ క్యారెక్టర్ బ్యాక్ బోన్. సినిమా అతనితోనే స్టార్ట్ అవుతుంది. అతనితోనే ఎండ్ అవుతుంది. నెగటివ్ షేడ్ ఉండే పాత్ర. మనీ అనే బబ్లీ, యంగ్ రోల్ చేశాను. అలాగే సైంటిస్ట్ పాత్రలో కనపడతాను. ప్రతి పాత్ర ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. బ్యూటీఫుల్ ఫాంటసీ, టైమ్ ట్రావెల్ మూవీయే కాదు, తల్లి సెంటిమెంట్, తండ్రి, సోదరుడు సెంటిమెంట్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి.
సినిమా కథ వినగానే తెలుగు, తమిళంలో నిర్మించాలనుకున్నారా?
ఫిలిం మేకర్స్ కంటే ఆడియెన్స్ పదిరెట్లు తెలివైనవారు. కథ వినేటప్పుడు కొత్తగా ఏమైనా చేస్తున్నామా, ఇస్తున్నామా అని ఆలోచిస్తాను కానీ తెలుగు ఆడియెన్స్ కు నచ్చుతుందా, తమిళ ఆడియెన్స్ కు నచ్చుతుందా అని ఆలోచించను. అందరూ చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఎవరినీ మోసం చేయలేం. ట్రెండ్ సెట్ మూవీ చేశానని చెప్పను కానీ, కొత్త జోనర్ లో ఒక కొత్త ప్రయత్నం చేశామని చెప్పగలను.
24 సినిమా పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?
అందరూ ఈ సినిమాను చేయడానికి రెండేళ్ల సమయం పట్టిందని అనుకుంటారు కానీ పక్కా ప్లానింగ్, మంచి టీం ఉండటంతో సినిమాను సంవత్సర కాలం లోపే పూర్తి చేసేశాం. సినిమా చిత్రీకరణకు 115రోజుల సమయం తీసుకున్నాం. మేకింగ్ లో జ్యోతిక బ్రదర్ పూర్తి సహకారం అందించాడు. తను ప్రియదర్శన్, సంజయ్ లీలా బన్సాలీ, కరణ్ జోహార్ వంటి దర్శకుల వద్ద పనిచేయడంతో సినిమాపై మంచి అవగాహన ఉంది. బెస్ట్ టెక్నికల్ టీంను రూపొందేలా సపోర్ట్ చేశాడు. షెడ్యూల్ ప్లానింగ్ పక్కాగా చేయడంతో త్వరగానే పూర్తి చేసేశాం.
తెలుగులో ఎప్పుడు డబ్బింగ్ చెబుతారు?
బ్రదర్స్, రక్తచరిత్ర సినిమాకు డబ్బింగ్ చెప్పాను కానీ అన్నీ సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పలేకపోతున్నాను. సాధారణంగా ఒక సినిమా నుండి మరో సినిమాకు వెళ్లడానికి ముందు ఒకటిన్నర నెల గ్యాప్ ఉంటుంది. అయితే ఆ గ్యాప్ లో ఎడిటింగ్ వర్క్ పోస్ట్ పోన్ కావడం, బ్యాక్ ల్యాగ్ ఏర్పడుతుంది. దాని వల్ల తెలుగు డబ్బింగ్ చెప్పడానికి సమయం దొరకడం లేదు.
మూడురోల్స్ చేయడం కష్టమనిపించలేదా?
ఒకరోజులో నేను ఒక తండ్రిగా, భర్తగా, కొడుకు, నటుడుగా ఇన్ని పాత్రలను పోషిస్తున్నాను. అలాంటప్పుడు సినిమాలో రోల్స్ చేయడానికి ఎందుకు కష్టం అని ఆలోచించాను కాబట్టే సులభంగా చేయగలిగాను.
సింగం సీక్వెల్, సికిందర్ వంటి సినిమాలను కమర్షియల్ కోణంలోనే ఆలోచించి చేస్తారా?
నా వరకు సింగం సీక్వెల్ కమర్షియల్ సినిమా కాదు. ఆ సినిమాలో హీరో పోలీస్, ఓ గ్రామం నుండి వచ్చి యువకుడు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంటాడు, తనకు ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఇలా అన్నీ ఎమోషన్స్ ఉండబట్టే ఆ సినిమాకు అందరూ కనెక్ట్ అయ్యారు. అందుకే సింగం సినిమా హిందీలో కూడా డబ్ అయ్యింది. పోలీస్ ట్రైనింగ్ లో కూడా సింగం సినిమాను చూపిస్తున్నారు. సింగం సినిమా వేరు, సికిందర్ సినిమా వేరు. ఓ సినిమాను స్టార్ట్ చేసినప్పడు చాలా లేయర్స్ వచ్చి చేరుతాయి. అందువల్ల సినిమా డైరెక్షన్ మారిపోయే అవకాశం ఉంది. అందుకని ఎవరినో నిందించలేం.
అగరం ఫౌండేషన్ లో యాక్టివ్ గా ఉన్నట్లున్నారు?
అవునండీ..అగరం ఫౌండేషన్ లో యాక్టివ్ ఉండటం హ్యపీగా ఉంది. ఈ ఫౌండేషన్ లో 1300 విద్యార్థులున్నారు. 1000 విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని బయటకు వెళుతున్నారు. అందరూ స్వచ్చదంగా సపోర్ట్ చేస్తున్నారు. మా ఫౌండేషన్ ద్వారా యాదుం వూరే` అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశాను. దీని ద్వారా ప్రజల్లో మన పరిసరాల, వాతావరణం గురించి అవగాహన కల్పిస్తాను. ఈ మ్యాగజైన్ కు నేనే ఎడిటర్ గా ఉన్నాను. నేను నా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాను. ప్లాస్టిక్ సంచులు వాడవద్దని, దాని వల్ల కలిగే నష్టాలను వివరించాను. ఇప్పుడు మా అమ్మాయి ప్లాస్టిక్ సంచులను వాడటం లేదు. నా స్టాఫ్ ను కూడా గుడ్డ సంచులనే వాడమని అంటుంది. నా ఇంట్లోనే మార్పు కనపడుతుంది. ఇలా నీటి వాడకం అవగాహన పెంచుతున్నాం.
మీ సినిమాలకు కష్టపడే డ్రైవింగ్ ఫోర్స్ ఎక్కడి నుండి వస్తుంది?
నేను కావాల్సినంత డబ్బు సంపాదించాను. పేరే సంపాదించాను. మంచి ఫ్యామిలీ ఉంది. అభిమానులున్నారు. ఇప్పుడు నేను బాధ్యతగా వ్యవహరించాలి. వారికి నేనేం ఇవ్వగలను. మంచి సినిమాలను చేయడమే మార్గం. నేను ఈ విషయంలో కమల్ సార్ ను ఫాలో కావడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన హిట్స్, ప్లాప్స్ గురించి ఆలోచించరు. ఫ్రెష్ కంటెంట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. అలాగే మనం ఓ సినిమాకు వెళితే అది మన ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలి.
తెలుగులో స్ట్రయిట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
నా నెక్ట్స్ మూవీ తెలుగులో చేయాలనుకుంటున్నాను. ఆ పాయింట్ తమిళ ఆడియెన్స్ కు కనెక్ట్ అయితే తమిళంలో కూడా చేస్తాను.
జ్యోతిక సినిమా ఎప్పుడు ఉంటుంది?
జ్యోతిక తమిళంలో 36 వయదినిలే చిత్రం తెలుగులో రిలీజ్ కావాల్సింది, కాలేదు. తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంటుంది. మే నెలాఖరున ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తాను. కుట్రం కడితం అనే సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ బ్రహ్మా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు.
త్రివిక్రమ్ గారితో సినిమా చేయబోతున్నారా?
అది ఆయన్న్ అడగాలి. ఎందుకంటే సాధారణ చర్చలు అయితే జరిగాయి కానీ తుది నిర్ణయం తీసుకోలేదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్
రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి. చర్చల దశలోనే ఉన్నాయి. ఇంకా మెటిరియలైజ్ కాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com