అల్లువారింట అట్లతద్ది!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో స్టయిలిష్ స్టార్ ఎవరు? అని అడిగితే ఎవరైనా అల్లు అర్జున్ పేరే చెబుతారు! స్టయిల్‌కి అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉంటారు. అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి కూడా ఎప్పుడూ స్టయిల్‌గా కనిపిస్తారు.
స్టయిల్‌తో పాటు సాంప్రదాయాలనూ పాటిస్తారని ఈ రోజు అల్లు స్నేహారెడ్డి ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవరైనా చెబుతారు. శనివారం అట్లతద్ది సందర్భంగా ఇంట్లో పూజలు చేశారు స్నేహారెడ్డి.
ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో, చూడముచ్చటి నగలతో నెటిజన్లను ఆమె విశేషంగా ఆకర్షించారు. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన హాలోవీన్ పార్టీలో ఇందుకు భిన్నంగా ట్రెండీ దుస్తుల్లో స్నేహారెడ్డి ఆకట్టుకున్నారు.
సినిమా సినిమాకు తన స్టయిల్ విషయంలో అల్లు అర్జున్ ఎంత వ్యత్యాసం చూపించారో.. స్నేహారెడ్డి కూడా సందర్భానుసారం అంతే వ్యత్యాసం చూపిస్తున్నారని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments