కష్టాన్ని భరిస్తున్న విశాల్.. బాటిళ్లతో దాడి, ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో విశాల్ కు తమిళంతో ఎంత అనుబంధం ఉందో తెలుగుతో కూడా అంతే బంధం ఉంది. అందుకే విశాల్ కోలివుడ్ లో ఉన్నప్పటికీ మనమంతా తెలుగు కుర్రాడే అని భావిస్తాం. విశాల్ కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్ తో ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా విశాల్ కు మంచి మార్కెట్ ఉంది.
ఇదీ చదవండి: నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం.. కొడుకు మృతి, భర్త ఆరోగ్యం కూడా..
కెరీర్ ఆరంభంలో విశాల్ మాస్ చేశాడు. ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్స్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం విశాల్ తన 31వ చిత్రం 'నాట్ ఎ కామన్ మ్యాన్' చిత్రంలో నటిస్తున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
తాజాగా ఈ చిత్ర యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. మాస్ ఫైట్ మూమెంట్స్ బిహైండ్ ది సీన్ అంటూ చిత్ర యూనిట్ ఈ వీడియో విడుదల చేసింది. కీలక యాక్షన్ ఎపిసోడ్ షూట్ వీడియో ఇది. రౌడీలు విశాల్ పై బాటిళ్లతో దాడి చేసే ఫైట్ సీన్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.
ఈ వీడియోలో విశాల్ కష్టం, డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ యాక్షన్ సీన్ లో నటించిన తర్వాత విశాల్ కళ్ళ మంటలతో ఎలా బాధపడుతున్నారో చూపించారు. తీవ్రమైన కష్టాన్ని భరిస్తూ కూడా విశాల్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి నటిస్తున్నాడు.
తు. ప. శరవణన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. తన సొంత నిర్మాణ సంస్థ 'విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ' బ్యానర్ లో విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరోవైపు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్ 'ఎనిమీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. విశాల్ చివరగా నటించిన యాక్షన్, చక్ర చిత్రాలు మంచి విజయం సాధించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments