అప్పుడు మిస్..ఇప్పుడు ఎస్..
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు ప్రముఖ కుటుంబాలకు చెందిన ఇద్దరు కథానాయకులు.. గత నెల మొదటివారంలో పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఒకరి సినిమా మరో వారం రోజుల పాటు వాయిదా పడింది. కట్ చేస్తే.. నెల రోజుల్లోపే ఇప్పుడు వారిద్దరి సినిమాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇంతకీ ఆ హీరోలెవరంటే.. మంచు కుటుంబానికి చెందిన మనోజ్, నారా వారింటి అబ్బాయి నారా రోహిత్.
గత నెల 4న మనోజ్ 'శౌర్య' సినిమా వస్తే.. ఆ రోజునే రావాల్సిన రోహిత్ 'తుంటరి' 11కి వాయిదా పడి రిలీజయింది. అప్పుడు పోటీ ని మిస్సయిన ఈ ఇద్దరూ ఈ ఏప్రిల్ 1న తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. మనోజ్ చిత్రం 'ఎటాక్'తో నారా రోహిత్ 'సావిత్రి' పోటీ పడనుంది ఆ రోజున. గత నెలలో విజయాలు సొంతం చేసుకోలేకపోయిన ఈ ఇద్దరికి ఈ సారైనా విజయాలు వరించాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com