మంచు మనోజ్ ఎటాక్ ఆడియో విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మనోజ్, సురభి జంటగా జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎటాక్. ఈ చిత్రాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. సి.కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎటాక్ ఆడియోను ప్రసాద్ ల్యాబ్స్ లో రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ...రామ్ గోపాల్ వర్మ రెగ్యులర్ మూవీస్ లా కాకుండా శివ - గాయం చిత్రాలను మించేలా ఎటాక్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్యాక్షన్ అనగానే రాయలసీమ గుర్తుకువస్తుంది. ఇందులో వాళ్ల ఎమోషన్ ఎలా ఉంటుందో చూపించారు. మనోజ్ కెరీర్ లో డిఫరెంట్ మూవీగా ఎటాక్ నిలుస్తుంది. టెక్నీకల్ గా క్వాలిటీ పరంగా బెస్ట్ అనిపించేలా ఈ సినిమాని వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలో రామాయణం - మహాభారతం కనిపిస్తాయి. ఎన్టీఆర్ రాముడుగా, శ్రీకృష్ణుడుగా నటించిన విజువల్స్ ఈ చిత్రంలో కనిపిస్తాయి. అవి ఈ చిత్రానికి ఎస్సెట్ గా నిలుస్తాయి అన్నారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ 2 సినిమాలు తీస్తున్న సమయంలో నువ్వు తీయాల్సింది ఇలాంటి సినిమాలు కాదు అంటూ సి.కళ్యాణ్ నాకు రెండు గంటలు క్లాస్ తీసుకున్నారు. దాని ఫలితమే ఎటాక్ మూవీ. మనోజ్ కళ్లల్లో ఇన్ టెన్సిటీ ఉంటుంది. గజల్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే గజల్స్ శ్రీనివాస్ ని కలిసిన తర్వాత గజల్స్ పై ఇంట్రస్ట్ పెరిగింది. ఈ చిత్రం ఆడియోన్స్ కి ఒక కొత్త అనుభూతి కలిగిస్తుంది అన్నారు.
రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ...రామ్ గోపాల్ వర్మ పై రెండు విమర్శలు ఉన్నాయి. ఒకటి తీసిన చిత్రాల్నే మళ్లీ తీస్తారని, రెండు సినిమాలను సీరియస్ గా తీసుకోరని. వర్మ పై ఉన్న రెండు విమర్ళలు ఈ సినిమాతో తుడిచిపెట్టుకుపోతాయి. ఈ సినిమాకి వర్క్ చేయడం వల్ల రామాయణం - మహాభారతం పై వర్మ గారికి ఎంత పట్టు ఉందో తెలిసింది. మనోజ్ రౌద్రంగా ఉంటే ఎలా ఉంటుందో దృష్టిలో పెట్టుకుని నాతో పాటలు రాయించారు. ఎటాక్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ...చాలా మంది చాలా సార్లు తమ సినిమాలో పాడమని అడిగినప్పటికీ ప్లేబ్యాక్ పాడకూడదని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేవాడిని. నిజంగానే నిర్ణయం తీసుకున్నాను. ఒకరోజు సిరాశ్రీ ఫోన్ చేసి వర్మగారి సినిమాకి మీరు పాడాలి అన్నాడు. వర్మ అభిమానిని..ఆయన పాట ఎలా ఉంటుందో ఏం పాడాలో నాకు తెలియంది కాదు. దేవాలయాలు కోసం ఉద్యమం చేస్తున్నవాడిని నా నోటితో వర్మ స్టైలో ఉండే నరకాలి..చంపాలి..అనే పదాలతో ఎలా పాట పాడను అని చెప్పాను. సిరాశ్రీ ఒకసారి నేను రాసిన పాట చదవండి అన్నాడు ఆయన పాట రాసిన విధానం నచ్చి ఈ పాట పాడాను.వర్మ సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగర్ గా పరిచయం అయినందుకు సంతోషంగా ఉంది అన్నారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ...రామ్ గోపాల్ వర్మ అంటే ఏక్టింగ్ - ఫిల్మ్ మేకింగ్ కి ఓ యూనివర్శిటీ లాంటి వ్యక్తి. ఆయనతో సినిమా అంటే ఏదో సాధించిద్దేం అని కాదు ఎంతో నేర్చుకోవచ్చు అని ఈ సినిమా చేసాను.జగపతిబాబు, ప్రకాష్ రాజ్...వీళ్లతో నటిస్తున్నప్పుడు వీళ్లు కనపడలేదు కేవలం క్యారెక్టర్స మాత్రమే కనిపించాయి అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సురభి, పూనంకౌర్, సంగీత దర్శకుడు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout