వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి.. కుట్ర జరిగిందా!?
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని గత కొన్నిరోజులుగా రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు విజయవాడ, గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి తీరాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైసీపీ నేతలు ర్యాలీ జరుగుతున్న ప్రదేశంలో కనపడితే చాలు కొట్టుకునేంత.. కొట్టేంత పరిస్థితులు నెలకొన్నాయ్. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు రాజధాని నిరసన సెగలు తగిలాయ్ కూడా..!
అసలేం జరిగింది!
అయితే తాజాగా.. గుంటూరు జిలమాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రైతులు దాడికి తెగబడ్డారు. జిల్లాలోని చినకాకాని హైవేపై ఆయన కారులో వెళ్తుండగా అడ్డుకున్న రైతులు, ఆందోళనకారులు.. కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తూ కారుపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే గన్మెన్లు, సెక్యూరిటీ సిబ్బందిపై కూడా కొందరు యువకులు దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. ఎమ్మెల్యే పిన్నెల్లి రాజీనామా చేయాలని రైతులు ఈ సందర్భంగా నినాదాలు చేస్తున్నారు.
దాడికి పాల్పడిందెవరు!?
కాగా.. పిన్నెల్లి మీద దాడికి పాల్పడిందెవరు..? అనే విషయం పూర్తిగా తెలియరాలేదు. మరోవైపు స్థానికులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని ఆందోళనలను చెదరగొట్టేందుకు ఎత్తుగడ వేశారా? లేదా.. వ్యూహం ప్రకారమే పిన్నెల్లిపై రాజధాని వ్యతిరేక శక్తులు దాడి చేశాయా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. పిన్నెల్లి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడం సరే.. దాడికి పాల్పడింది ఎవరు? కుట్ర కోణం ఉందా? అనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో రాజధాని ప్రాంతంలో.. స్థానికుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజధాని గ్రామాల్లో అసలేం జరుగుతోంది..? అనేది ఎవరికీ తెలియట్లేదు. కాగా ఘటనాస్థలిలో ఉన్న పోలీసులు దీనికి కారణాలు..? దాడి చేసిందెవరనేది చెప్పాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments