Vijay Thalapathy: విజయ్‌కాంత్ అంత్యక్రియల్లో దళపతి విజయ్ మీద చెప్పుతో దాడి

  • IndiaGlitz, [Friday,December 29 2023]

తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు 'కెప్టెన్ విజయకాంత్'(Vijayakanth) గురువారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ చెన్నైలో ఆయన అంత్యక్రియలు అభిమానుల ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. అంతకుముందు కెప్టెన్ భౌతికకాయానికి తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే దళపతి విజయ్ కూడా ఆయనకు నివాళులర్పించేందుకు రాగా ఊహించని పరిణామం ఎదురు కావడం సంచలనంగా మారింది.

నివాళులర్పించిన అనంతరం కారులో ఎక్కుతుండగా ఓ ఆగంతకుడు వెనక నుంచి చెప్పు విసిరారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వ్యవహారశైలి మంచిది కాదని మండిపడుతున్నారు. కెరీర్ ప్రారంభంలో విజయకాంత్‌కు ఫ్లాప్స్ వచ్చి ఇబ్బందులు పడుతున్న సమయంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్.. ఆయనకు బ్రేక్ ఇచ్చారు. చంద్రేశేఖర్ దర్శకత్వం వహించిన 'దూరతు ఇడి ముళక్కం', 'సత్తం ఓరు ఇరుత్తరై' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. అక్కడి నుంచి విజయ్‌కాంత్ స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్నారు.

కాగా 1952 ఆగస్ట్ 25న మధురైలో జన్మించిన విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. తల్లిదండ్రులు కేఎన్ అళగర్ స్వామి, అండాల్ స్వామి, విజయ్ కాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు వున్నారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన తన పేరును విజయ్ కాంత్‌గా మార్చుకున్నారు. 1979లో 27 ఏళ్ల వయసులోనే ఆయన తెరంగేట్రం చేశారు. కెప్టెన్ నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్ ఇలమై’. ఆ చిత్రంలో విలన్ రోల్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాటి నుంచి 2015 వరకు నటిస్తూ వచ్చారు. ఒక దశలో 3 షిఫ్టుల్లోనూ పనిచేసి ఎంతోమందికి ఉపాధి కల్పించారు.

తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్ కాంత్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2016లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. అయితే విజయ్ కాంత్ గత కొన్నేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. మనదేశంతో పాటు విదేశాల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఆయన చికిత్స పొందారు. ఈ క్రమంలో గత నెల 18న జలుబు, దగ్గుతో బాధపడుతూ మయత్ ఆసుపత్రిలో చేరారు. 23 రోజుల పాటు చికిత్స తీసుకుని డిసెంబర్ 11న డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి అనారోగ్యానికి గురైన కెప్టెన్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

More News

Revanth Reddy: 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' షోలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్న.. ఏంటంటే..?

"కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC)" షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహరించే ఈ షో దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది.

Ministers:కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి: మంత్రులు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం శుక్రవారం పరిశీలించింది.

CM Jagan:భార్యలను మారుస్తూ ఉంటారు.. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఘాటు విమర్శలు..

టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని.. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ పవన్ కల్యాణ్ గురించి సీఎం జగన్(CM Jagan) సెటైర్లు వేశారు.

Johnny Master:సీఎం జగన్ అంటే నాకు ఎంతో ఇష్టం: జానీ మాస్టర్

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఎప్పుడూ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో కనుక్కోవడం కష్టంగా మారింది.

Vyooham:'వ్యూహం' సినిమా విడుదలకు బ్రేక్.. రామ్‌గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు..

ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'వ్యూహం' సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది.