అర్నబ్‌ గోస్వామిపై దాడి వెనుక అసలేం జరిగింది.. ఎందుకిలా..!?

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై బుధవారం అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని టీవీ చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయన కారుపై రసాయనాలు పోసి దాడి చేశారు. అయితే ఈ దాడికి కారణం ఇటీవల ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురించి చేసిన డిబేటే అని తెలుస్తోంది. ఈ ఘటనపై ఓ వీడియోను అర్నబ్ విడుదల చేశారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే తనపై దాడికి కారణమని ఆరోపించారు.

అసలేం జరిగింది..!?

రాత్రి 12:15 గంటల సమయంలో ఛానెల్ నుంచి ఇంటికి బయలుదేరగా.. మా కారును రెండు బైక్‌లు వెంబడించాయి. మా కారుకు క్రాస్ చేస్తూ నడుపుతూ వారు కారులోకి తొంగిచూశారు. ఆపై ఓవర్ టేక్ చేసి, రోడ్డుకు అడ్డంగా బైక్‌లను ఆపారు. వారి నుంచి తప్పించుకునేందుకు నేను కారును ఆపకుండా పోనిస్తుంటే.. కారు అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఏదో ద్రావకం ఉన్న సీసాలను మా కారుపై విసిరేశారు. ఆ వెంటనే నేను కారును మరింత వేగంగా డ్రైవ్ చేశాను. నా కారు వెనకే వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకున్నారు. నా సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడగా, యూత్ కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించారు’ అని అర్నబ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. పోలీసు స్టేషన్‌లో తాము ఫిర్యాదు చేశామని.. ఈ దాడికి సోనియా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

భారత్‌లో ఉండటం బాధాకరం..

అర్నబ్‌పై దాడి ఘటన ప్రస్తుతం జాతీయ మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ దాడిని కొంత మంది మాత్రమే ఖండిస్తున్నప్పటికీ.. చాలా వరకు ఇది సబబే అని నెటిజన్లు, కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం స్పందిస్తూ.. సోనియాపై అర్నాబ్‌ వాడిన భాష సరిగా లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆరోపణలు అర్నాబ్‌ మానుకోవాలన్నారు.

జర్నలిజం అంటే పార్టీ కోసం పనిచేయడం కాదని.. అర్నాబ్‌లాంటి వారు భారత్‌లో ఉండడం దురదృష్టకరమని శీలం వ్యాఖ్యానించారు.

More News

తార‌క్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన చిరు, వెంకీ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ డిఫ‌రెంట్

స‌మంత ఈజ్ బ్యాక్‌

స‌మంత అక్కినేనికి ఏమైంది? అని చాలా రోజులుగా ఆమె అభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. సాధార‌ణంగానే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స‌మంత.. ఇప్ప‌డు కామ్ అయిపోయారు.

క్రియేటివిటీని పీక్స్‌లో చూపిస్తున్న పాయ‌ల్‌

హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన క్వారంటైన్ టైమ్‌ను డిఫ‌రెంట్‌గా వాడుకుంటుంది. ఇంటిప‌నులు చేసుకుంటున్నాన‌ని

కిమ్.. మీరు బాగుండాలి.. : ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా వ్యాప్తి దృష్ట్యా అమర్ నాథ్ యాత్ర రద్దు

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారతదేశంలోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నాలు