హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద సినీనటి చౌరాసియాపై దాడి.. మొబైల్ చోరీ, రంగంలోకి పోలీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
వాకింగ్‌కు వెళ్లిన సినీనటీపై దాడి ఘటనతో తెలుగు చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో వర్థమాన నటి చౌరాసియా తలకు, కాళ్లకు గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో చౌరాసియా హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్దకు వాకింగ్ నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న తనపై ఓ దుండగుడు దాడికి పాల్పడినట్లు చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన ముఖంపై పిడిగుద్దులతో గుద్ది, బండరాయితో దాడి చేసే యత్నం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిని ప్రతిఘటించే సమయంలో దుండగుడు తన ఫోన్ తీసుకుని పారిపోయాడని.. అంతేగాక తనను నగలు, నగదు ఇవ్వాలని కూడా దుండగుడు డిమాండ్ చేసినట్లు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సీసీ టీవీ పుటేజ్ పరిశీస్తున్నట్లు పోలీసులు మీడియాతో పేర్కొన్నారు. ప్రస్తుతం చౌరాసియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments