డైరెక్టర్ విజయ్ కుమార్ పై దాడియత్నం
- IndiaGlitz, [Wednesday,March 08 2017]
'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండాపై దాడియత్నం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రేమ పెళ్లినే ఇంతవరకూ దారి తీసిందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న కొండాపై ఈ అనూహ్య దాడి పెను సంచలనంగా మారింది. డీటైల్స్ లోకి వెళ్తే..
కొండా పెళ్లిలో భాగంగా ఓ మ్యాట్రీమోని ద్వారా ప్రసూన అనే అమ్మాయి తో పెళ్లి కుదుర్చుకునేందుకు ఇరు కుటుంబ సభ్యలు అంగీకరించారు. అయితే పెళ్లి దగ్గరపడుతోన్న సమయంలో ప్రసూయ తల్లిదండ్రులు ఎందుకనో వెనకడుగు వేశారు. అప్పటికే ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారడంతో కొండా ప్రసూనను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ వివాహం ఇష్టం లేని కుటుంబ సభ్యలు తమ కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని..దీనిలో భాగంగా కొండాపై దాడి యత్నం జరిగినట్లు తెలుస్తోంది.