‘ఆత్మ నిర్భర భారత్‌’ నాలుగో ప్యాకేజీ : 8 రంగాల్లో కీలక సంస్కరణలు

ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే మూడు ప్యాకేజీలకు సంబంధించి వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయక మంత్రులు మీడియాకు వెల్లడించాగా తాజాగా.. నాలుగో ప్యాకేజీ వివరాలు తెలిపారు. ఇందులో ఎనిమిది రంగాల్లో కీలక సంస్కరణలకు సంబంధించిన కీలకాంశాలు ఉన్నాయి. టూరిజం, రవాణా రంగానికి ప్రోత్సాహకాలు పాలనా సంస్కరణల్లో ప్రధాని మోదీ ముందుంటారని.. తీవ్రపోటీని ఎదుర్కొనేందుకు మనల్నిమనం తయారుచేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో పోటీని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. చాలా రంగాలు సరళీకరణ విధానాలు కోరుకుంటున్నాయన్నారు. ఒకే దేశం-ఒకే మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు.

8 రంగాలు ఇవే..

ఫాస్ట్‌ట్రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో పాలసీ సంస్కరణలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా ప్రతి మినిస్ట్రీలో ప్రత్యేకంగా డెవలప్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగుతోందని.. ఉపాధి అవకాశాలు పెంచేందుకు సంస్కరణలు చేస్తున్నామన్నారు. మరీ ముఖ్యంగా 8 రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకురాబోతున్నామని ఆమె తెలిపారు. ‘బొగ్గు, సహజ వనరులు, ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్పేస్‌ మేనేజ్‌మెంట్‌, డిఫెన్స్‌ ప్రొడక్షన్‌, స్పేస్‌, అణుశక్తి రంగాల్లో సంస్కరణలు చేస్తున్నాం. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ జరుగుతుంది. సోలార్‌ ఉత్పత్తికి ఊతం ఇచ్చేలా చర్యలు చేపడుతాం. రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తాం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.

వంద టన్నులు టార్గెట్..

‘కోల్‌ సెక్టార్‌లో కమర్షియల్‌ మైనింగ్‌కి అనుమతులిస్తాం. ఆదాయం వాటా పద్ధతుల్లో కమర్షియల్‌ మైనింగ్‌ ఉంటుంది. బిడ్డింగ్‌కు అందుబాటులో 50 బొగ్గుగనులుంటాయ్. దేశవ్యాప్తంగా కొత్తగా 500 మినరల్‌ మైన్స్‌ ఏర్పాటు చేస్తాం. తవ్వకం, ఉత్పత్తి, మార్కెటింగ్‌కు అనుమతిస్తాం. మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం వల్ల ఉపాధికి అవకాశాలు పెరుగుతాయి. మైనింగ్‌ రంగంలో ఇన్‌ఫ్రాకు రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నాం. 2023-24లో వంద కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. కోల్‌ మైన్‌ యాంత్రీకరణకు రూ.18వేల కోట్లు కేటాయిస్తున్నాం. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహాలు ఉంటాయి. అంతరిక్ష ప్రయాణం, పరిశోధనల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశం ఉంటుంది. సంక్షేమ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. సంక్షేమరంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.8,100 కోట్లు కేటాయిస్తాం’ అని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. కాగా.. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని.. ఇదంతా ఉత్తుత్తి ప్యాకేజీనే అని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

More News

కేంద్రం సంచలన నిర్ణయం.. ఇవన్నీ ఇక ప్రైవేట్‌కే..!?

కరోనా మహమ్మారి దెబ్బతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. అసలు ఈ లోటు నుంచి ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు

డిసెంబ‌ర్‌లో నితిన్ పెళ్లి..?

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఏర్ప‌డించి జ‌నాలు ప‌దిమందికి పైగా ఎక్క‌డైనా గుమిగూడాలంటే ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌డం లేదు. అయితే అంతకు ముందే పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్న టాలీవుడ్ సెల‌బ్రిటీలు

అనుష్క 'నిశ్శబ్దం', 'ఉప్పెన‌' ఓటీటీలోనేనా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి

అగ్ర నిర్మాణ సంస్థ సినిమాలో సమంత..?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి. అలాగే ఆమె సినిమాల‌ను ఎంచుకుంటుంది.

సితార కోసం మ‌హేశ్ పాట‌!!

క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల నెల‌కున్న లాక్‌డౌన్ కార‌ణంగా సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. అంద‌రూ కుటుంబ స‌భ్యుల‌తో వారి విలువైన స‌మ‌యాన్ని గడుపుతున్నారు.