హైదరాబాద్‌లో ఏటీఎం కార్డుల క్లోనింగ్‌ ముఠా అరెస్టు

  • IndiaGlitz, [Wednesday,March 18 2020]

జల్సాలకు అలవాటు పడ్డ దుండగులు రోజురోజుకూ ప్లాన్‌లు మార్చేసి సరికొత్త పంథాలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాకు సైబరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఒడిశా ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడం జరిగింది. కాగా.. నగరంలోని పలు రెస్టారెంట్లు, పబ్బులలో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులను ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. అయితే.. గచ్చిబౌలి హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు అరెస్ట్ చేసి 140 క్లోనింగ్‌ ఏటీఎం కార్డుల సాయంతో రూ. 13 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు తెలుసుకున్నారు. నిందితుల నుంచి రూ. 10 లక్షలతో పాటు స్కిమర్‌, క్లోనింగ్‌ మిషన్‌, 44 క్లోన్డ్‌ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని మీడియాకు వివరాలు వెల్లడించారు.

కాగా. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ప్రఫుల్ కుమార్ అని పోలీసులు గుర్తించారు. స్కిమర్, క్లోనింగ్ మిషన్ లను కొనుగోలుచేసి హై క్లాస్ రెస్టారెంట్లు, పబ్‌లలో వెయిటర్‌లుగా చేరి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కస్టమర్ బిల్లులు చెల్లించేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న స్కిమర్ సహాయంతో కార్డులోని డేటాను దొంగిలించి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతుండేవారని తేలింది. అనంతరం ఆ డేటా సహాయంతో డబ్బులు విత్ డ్రా చేసుకునేవాళ్లని ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. కాగా ఈ అరెస్ట్ ఘటనకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది.

More News

హీరోయిన్స్‌ను రిపీట్ చేస్తున్న మాస్ రాజా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు ఏక‌ధాటిగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ సినిమాలు చేసేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గుండె ప‌గిలిందంటూ ఎమోష‌న‌ల్ అయిన కాజ‌ల్‌

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను ఆరిక‌ట్ట‌డానికి ప్ర‌భుత్వాలు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

పాట‌తో షురూ చేయ‌నున్న బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

నమితకు యువకుడి బెదిరింపులు.. స్ట్రాంగ్ వార్నింగ్

అందాల ముద్దుగుమ్మ.. బొద్దుగుమ్మ నమిత గురించి సినీ ప్రియులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ చిత్రాల్లో ఓ మెరుపు మెరిసిన నమిత..

కరోనాకు ఇదే అసలైన మందు..: మహేశ్ బాబు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా వరకు జనాల్లోకి వెళ్లలేదు.