అట్లీ డైరెక్షన్‌లో బాద్షా..లక్కీ హీరోయిన్‌తో జోడి..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సూపర్‌స్టార్స్ ఖాన్ తయ్రంలో ఒకరైన షారూక్‌ఖాన్.. త్వరలోనే ఓ సౌతిండియన్ డైరెక్టర్‌తో మూవీ చేయబోతున్నాడు. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. అట్లీ. ఇప్పటి వరకు నాలుగు సినిమాలను మాత్రమే అట్లీ డైరెక్ట్ చేశాడు. అంనాలుగూ బ్లాక్‌బస్టర్ చిత్రాలే. కాగా.. నాలుగో చిత్రం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో తెరకెక్కించిన `బిగిల్` సమయంలో అట్లీని షారూక్ కలిసి కథ విన్నాడు. కథ నచ్చడంతో షారూక్ సినిమాకు అప్పట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వీరి చర్చలను చూసినవారు షారూక్‌ఖాన్ `బిగిల్` చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడన్నారు. కానీ షారూక్, అట్లీ కాంబినేషన్‌లో సినిమాకు జరిగిన చర్చలనీ ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చాయి.
లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు షారూక్‌ఖాన్ రెండు భారీ చిత్రాలను సిద్ధం చేసుకుంటున్నాడట. అందులో తొలి చిత్రం అట్లీ దర్శకత్వంలోనే ఉంటుందని సమాచారం. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుందని టాక్. షారూక్, దీపికా నాలుగు చిత్రాల్లో నటిస్తే.. అందులో ఓంశాంతిఓం, చెన్నైఎక్స్‌ప్రెస్ చిత్రాల్లో వీరివురూ జోడి కట్టారు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో షారూక్, దీపిక జోడీ కడుతున్నారని టాక్. ఈ చిత్రానికి ‘సంకి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com