పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ‘అతిథి’ హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ‘అతిథి’ సినిమాలో హీరోయిన్గా నటించిన అమృతా రావు ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. అమృతాకావెచ ఆర్జే అన్మోల్ దంపతులు పండంటి మగబిడ్డకు స్వాగతం పలికారని.. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. అభిమానుల అభినందనలు, ఆశీర్వాదాలకు అమృత దంపతులు ధన్యవాదాలు తెలిపారని కుటుంబ సభ్యులు ప్రకటనలో వెల్లడించారు.
అన్మోల్, అమృత దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడేళ్ళ పాటు ప్రేమించుకున్న అనంతరం 2016లో అన్మోల్, అమృత వివాహం చేసుకున్నారు. కాగా గత నెలలో అమృతారావు బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అమృత వెల్లడించింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతిథి’ సినిమాలో తొలిసారిగా తెలుగు తెరపై అమృతారావు కనిపించింది. ఈ సినిమా తరువాత ఆమె తెలుగు తెరపై తిరిగి కనిపించలేదు. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో అమృతారావు నటించింది. ఆమె చివరిసారిగా 2019లో ‘ఠాక్రే’లో జువాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com