బిగ్‌బికి ధైర్యం చెప్పిన కాసేపటికే.. అనుపమ్ ఖేర్‌ ఇంట కరోనా కల్లోలం

కరోనా మహమ్మారి బాలీవుడ్‌ను భయపెడుతుంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా అని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించగానే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఆయనకు ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇంతలోనే ఆయనకు కరోనా షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబంలోనే కరోనా కల్లోలం రేపింది. తన కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. వాళ్లందరికీ ఓ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

‘‘మా అమ్మ దులారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మేము ఆమెను చికిత్స నిమిత్తం కోకిబెన్ ఆసుపత్రికి తరలించాము. అలాగే మా సోదరుడు, వదిన, మేనకోడలికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను కూడా పరీక్ష చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చింది’’ అని అనుపర్ ఖేర్ వెల్లడించారు. కాగా బిగ్‌బి కుటుంబంలోనూ ఆయనతో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యతో పాటు ఆయన కూతురి కుమార్తెకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

More News

ఐశ్వర్యారాయ్.. ఆమె కూతురు ఆరాధ్యకూ కరోనా పాజిటివ్

ప్రముఖ నటి, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అమితాబ్‌జీ ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

పవన్ ‘తొలిప్రేమ’ను టార్గెట్ చేస్తున్న వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో శనివారం గణనీయంగా తగ్గిన కేసులు...

తెలంగాణలో శనివారం కరోనా కేసులు చాలా వరకూ తగ్గాయి. కొద్ది రోజులుగా 5వేల శాంపిల్స్‌ను పరిశీలిస్తేనే..

11 గంటలకు ‘జూమ్’ ద్వారా మీటింగ్: వరవరరావు కుటుంబం

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కుటుంబం ప్రజలను మీటింగ్‌కు ఆహ్వానిస్తోంది.