మూడు భాషల్లో ఒకేసారి....
Send us your feedback to audioarticles@vaarta.com
2013లో సమ్ థింగ్ సమథింగ్ సినిమాతో తెరపై హీరోగా కనపడ్డ సిద్ధార్థ్ తర్వాత తెలుగు సినిమాలో నటించనే లేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత త్రిభాషా చిత్రం ద్వారా సిద్ధార్థ్ తెలుగు తెరపై కనపడనున్నాడు. హారర్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనుంది. తెలుగు, హిందీల్లో 'ది హౌస్ నెక్ట్స్ డోర్' అనే పేరుతో తమిళంలో అవల్ అనే పేరుతో విడుదలవుతుంది. అండ్రియా హీరోయిన్గా నటిస్తుంది.
వయాకామ్ మోషన్ పిక్చర్స్, ఇటాకీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్స్తో పాటు సిద్ధార్థ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారట. మిలింద్ రావ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. నవంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు సిద్ధార్థ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వస్తోన్న సిద్ధార్థ్‌ను తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments