39 ఏళ్లకే ఆ మహిళకు 44 మంది పిల్లలు.. ఇక ఆపేయమన్న ప్రభుత్వం
- IndiaGlitz, [Saturday,May 29 2021]
39 ఏళ్లకే 44 మంది పిల్లలను కనడం సాధ్యమా? ఛాన్సే లేదు అంటారా..? కానీ ఈ అసాధ్యాన్ని ఓ మహిళ సుసాధ్యం చేసేసింది. చివరకు ప్రభుత్వమే దిగి వచ్చి ఇక ఆపెయ్ తల్లో అని మొత్తుకునే వరకూ వ్యవహారం వెళ్లింది. అసలు విషయంలోకి వెళితే.. ఉగాండాకు చెందిన 40 ఏళ్ల మరియంకు 12 ఏళ్లకే వివాహం జరిగింది. 13వ ఏటే ఆమెకు కవలలు జన్మించారు. దీంతో వెంటనే ఆమె వైద్యుల వద్దకు వెళ్లి తనకు పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయాలని కోరింది. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అవాక్కయ్యారు.
ఆమెకు పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయడం సాధ్య పడదని పైగా ఆమె అండాశయాలు చాలా పెద్దవని.. భవిష్యత్తులో మరింత మంది కవలలకు మరియం జన్మనిచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అక్షరాలా వైద్యులు చెప్పినట్టే జరిగింది. ఆమె గర్భాశయంలో ఒకేసారి అనేక పిండాలు విడుదల అవడం.. ప్రతి సారీ ఆమెకు ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు చొప్పున మొత్తంగా 44 మంది పిల్లలు జన్మించారు. అయితే తొలి కాన్సులో కవలలకు జన్మనిచ్చిన మరియం.. ఆ తర్వాత 5 సార్లు కవలలకు, ఏడుసార్లు ముగ్గురేసి, ఐదు సార్లు నలుగేసి పిల్లలకు జన్మనిచ్చింది.
ఇదీ చదవండి: నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే డాక్టర్ దంపతుల హత్య
అయితే వీరిలో కొందరు పుట్టగానే మృతి చెందారు. ప్రస్తుతం 38 మంది పిల్లలు మాత్రమే మిగిలారు. మూడేళ్ల కిందట మరియంను భర్త వదిలేశారు. దీంతో వారిని పోషించే బాధ్యత ఆమెపైనే పడింది. పిల్లల పోషలణకు రోజుకు సుమారు 25 కిలోల గోధుమ పిండి ఖర్చవుతోంది. ఆమె స్థానిక మీడియా సంస్థకు వెల్లడించింది. వారిని పోషించడం చాలా కష్టంగా మారిందని వెల్లడించింది. ఆమె పరిస్థితిని చూసి ఆదుకునేందుకు స్థానిక ప్రభుత్వం రంగంలోకి దిగింది. అయితే ఇకపై పిల్లలను కనకూడదనే షరతు విధించింది. అలాగే ఆమె గర్భాశయాన్ని తొలగించాలంటూ వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక వైద్యులు అప్రమత్తమయ్యారు.