ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు నిర్మాత అశ్వనీదత్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీ నిర్మాత సి.అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు అశ్వనీదత్ భూములిచ్చారు. కాగా.. భూ సేకరణ చట్ట ప్రకారం తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు గాను.. అశ్వనీదత్‌కు అమరావతిలో భూమిని ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు నుంచి వైదొలగడంతో తనకు నష్టం చేకూర్చిందని అశ్వనీదత్ దంపతులు కోర్టుకు తెలిపారు.
తాను గన్నవరం విమానాశ్రయం విస్తరణకు 39 ఎకరాల భూమిని ఇచ్చినట్లు అశ్వనీదత్ తెలిపారు. అందుకుగానూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రూ.210 కోట్లు తనకు చెల్లించేలా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ప్రస్తుతం ఉన్న భూమి విలువకుగానూ తనకు పరిహారంగా నాలుగు రెట్లు చెల్లించేలా చూడాలని నిర్మాత అశ్వనీదత్ హైకోర్టును కోరారు.
న్యాయవాది జంధ్యాల రవి శంకర్.. అశ్వనీదత్ తరుఫున కేసును వాదించారు.ఏడాదిగా అశ్వనీదత్‌కు భూమి లీజ్ కూడా చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. ఫైనల్ కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీఏకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments