ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు నిర్మాత అశ్వనీదత్..

ప్రముఖ సినీ నిర్మాత సి.అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు అశ్వనీదత్ భూములిచ్చారు. కాగా.. భూ సేకరణ చట్ట ప్రకారం తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు గాను.. అశ్వనీదత్‌కు అమరావతిలో భూమిని ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టు నుంచి వైదొలగడంతో తనకు నష్టం చేకూర్చిందని అశ్వనీదత్ దంపతులు కోర్టుకు తెలిపారు.

తాను గన్నవరం విమానాశ్రయం విస్తరణకు 39 ఎకరాల భూమిని ఇచ్చినట్లు అశ్వనీదత్ తెలిపారు. అందుకుగానూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రూ.210 కోట్లు తనకు చెల్లించేలా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ప్రస్తుతం ఉన్న భూమి విలువకుగానూ తనకు పరిహారంగా నాలుగు రెట్లు చెల్లించేలా చూడాలని నిర్మాత అశ్వనీదత్ హైకోర్టును కోరారు.

న్యాయవాది జంధ్యాల రవి శంకర్.. అశ్వనీదత్ తరుఫున కేసును వాదించారు.ఏడాదిగా అశ్వనీదత్‌కు భూమి లీజ్ కూడా చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. ఫైనల్ కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీఏకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది.

More News

హైదరాబాద్‌లో దారుణం.. ముంబై యువతిపై అత్యాచారయత్నం

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన యువతితో బలవంతంగా మద్యం తాగించి ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు.

కొర‌టాల వెబ్ సిరీస్‌లో న‌వీన్ పొలిశెట్టి..?

డైరెక్ట‌ర్స్ విష‌యానికి వ‌స్తే స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థను స్థాపించి తన దర్శకత్వ శాఖలోని

న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోంది: రఘురామ ఆవేదన

ద్రౌపది వస్త్రాపహరణంతో ఏపీ రాజకీయాలను పోల్చి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

హైకోర్టుకు బాలీవుడ్... వ‌ర్మ ఎద్దేవా!!

బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ కొన్ని మీడియా సంస్థ‌ల‌పై హైకోర్టును ఆశ్ర‌యించింది.

అన్న‌పై కౌంట‌ర్... త‌మ్ముడు రీకౌంట‌ర్‌

క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్‌గా రాజ‌కీయాలు, ఓటర్లు గురించి మాట్లాడుతూ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.