ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అది ఉండాల్సిందే : యువ నటుడు అశ్విన్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
జీనియస్ సినిమా తర్వాత ఓంకార్ తెరకెక్కించిన చిత్రం రాజు గారి గది. అశ్విన్, చేతన్, ధన్యబాలకృష్ణన్,షకలక శంకర్, ధనరాజ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ఈ హర్రర్ కామెడి చిత్రం రాజు గారి గది దసరా రోజున రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా రాజు గారి గదిలో నటించిన ఓంకార్ తమ్ముడు, యువ నటుడు అశ్విన్ బాబు తో ఇంటర్ వ్యూ మీకోసం..
రాజు గారి గదికి మంచి స్పందన లభిస్తోంది..మీరెలా ఫీలవుతున్నారు..?
ఈ సినిమాను డిసెంబర్ 4న రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అయితే ఊహించని విధంగా దసరా రోజున రిలీజ్ చేసే అవకాశం రావడం..దసరా రోజు రిలీజై సక్సెస్ సాధించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఇంకా థియేటర్స్ పెంచుతున్నాం. అలాగే ఓవర్ సీస్ లో ఈ మూవీని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నాం.
ఈ మూవీని ప్రేక్షకులతో కలసి చూసారా..?
దిల్ సుఖ్ నగర్ వెంకటాద్రి ధియేటర్లో ప్రేక్షకులతో కలసి ఈ సినిమా చూసాను. సినిమా క్లైమాక్స్ వరకు ఆడియోన్స్ ఉంటారో..? ఉండరో...? అని చూసాను. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఊహించిన దానికన్నా ఎక్కువుగా ఆడియోన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ తీసేసారు. ఆ సీన్స్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారినిపించింది.
జీనియస్ తర్వాత మళ్లీ మీ అన్నయ్య ఓంకార్ మూవీలోనే చేసారు. అవకాశాలు రాలేదా..?
జీనియస్ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయమని చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇక్కడో విషయం చెప్పాలి..నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్టేట్ లెవల్లో కూడా ఆడాను. అయితే సి.సి.ఎల్ లో ఆడాలనేది నా కోరిక. సి.సి.ఎల్ లో ఆడాలంటే అయిదారు సినిమాల్లో నటించి ఉండాలి. కేవలం సి.సి.ఎల్ లో నటించడం కోసమన్నా వచ్చిన అవకాశాలను వినియోగించుకుని చిన్న క్యారెక్టర్ అయినా సరే చేసేద్దాం అనుకున్నాను. కానీ అన్నయ్యే వెయిట్ చేయమన్నాడు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అంతే కానీ అవకాశాలు రాక కాదు.
రాజు గారి గది ఇంతటి విజయం సాధించడానికి కారణం ఏమిటనుకుంటున్నారు..?
వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, తరుణ్, నాని..ఇలా చాలా మంది రాజు గారి గది అనే సినిమా వస్తుంది అని చెప్పడం వలన బాగా జనంలోకి వెళ్లింది. అది బాగా కలిసొచ్చి మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆతర్వాత అన్నయ్య ఎంచుకున్న కథ..కథకు తగ్గట్టుగా పూర్ణ, షకలక శంకర్, థనరాజ్, బుజ్జమ్మ..తదతరుల నటన బాగా ఆకట్టుకోవడం రాజు గారి గది విజయానికి కారణం అనుకుంటున్నాను.
మీ అన్నయ్య వలన రెండు అవకాశాలు వదులుకోవలసి వచ్చింది కదా..అప్పుడు మీ ఫీలింగ్..?
ఆట ప్రొగ్రాంలో నేను ఫైనల్ కి వస్తే..ఓంకార్ తమ్ముడు కాబట్టి నేను ఫైనల్ కి వచ్చేలా ప్లాన్ చేసారనుకుంటారని నన్ను తప్పుకోమని అన్నయ్య చెప్పినప్పుడు ఓకె అన్నాను. అలాగే వేరే సినిమా విషయంలో కూడా జరిగింది. అయితే నాకు అన్నయ్య పై నమ్మకం. నాకు ఏది చేసిన మంచి చేస్తాడనే నమ్మకం. ఆ నమ్మకం నేడు నిజమైంది. ఈ సినిమాలో అన్నయ్య అవకాశం ఇవ్వడం.. మంచి విజయం సాధించడం.. చాలా ఆనందంగా ఉంది.
రాజు గారి గదికి సీక్వెల్ తీస్తారా..?
ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే..సీక్వెల్ తీస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అయితే అది అన్నయ్యేనే అడగాలి.
ఇండస్ట్రీలో మీరు గమనించింది ఏమిటి..?
ఇండస్ట్రీలో నేను గమనించింది ఏమిటంటే..సక్సెస్ అవ్వాలంటే అద్రుష్టం, కష్టపడే తత్వం, టాలెంట్ తో పాటు సహనం కూడా ఉండాలి.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
జతకలిసే అనే సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలో తేజస్విని హీరోయిన్. రాకేష్ డైరెక్టర్. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments