వాళ్ల సినిమాలు చూడొద్దు.. మానేయండి: అశ్వనీదత్
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నెలకొన్న ఆందోళనలపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్.. చేసిన దాంట్లో 10 శాతం చేసినా గొప్ప సీఎం అవుతారని ఆయన హితవు పలికారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు టాలీవుడ్‌కు చెందిన నటీనటుల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు.
వాళ్ల సినిమాలు చూడొద్దు!
‘పృథ్వీ హాస్యనటుడు.. ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన అర్ధం లేదు. పృథ్వీ లాంటి వారి వల్లే జగన్ భ్రష్టు పట్టిపోతున్నారు. మద్దతు కోసం సినీ హీరోలను రైతులు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారు (పరోక్షంగా మహేశ్ బాబును). నటుడిగా కాకున్నా.. సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా?. వాళ్ల సినిమాలు చూడడం మానేయండి.. వారే దిగివస్తారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నారో ఆయన కుటుంబ సభ్యులకే అర్ధం కావడం లేదు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిస్తే.. ప్రతిగా రాజధానిలో భూములిచ్చారు. ఎయిర్‌పోర్టు విస్తరించారు..ఆ భూములను ఎలా తిరిగిస్తారు?. 151 సీట్లు ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి’ అని అశ్వనీదత్ విమర్శలు గుప్పించారు.
కాగా.. మహేశ్ హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ అవ్వగా.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ రేపు విడుదల కానుంది. అయితే అశ్వనీదత్ మాత్రం పరోక్షంగా వాళ్ల సినిమాలు చూడొద్దని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చిరు, మహేశ్, పవన్ కల్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments