శివశంకర్ మాస్టర్ జాతకం చూసి జ్యోతిష్యుడు ఏమన్నాడో తెలుసా...?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో నెటిజన్లు ఆయన గురించి ఇంటర్‌నెట్‌ను జల్లెడ పడుతున్నారు. చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్‌కు చిన్న వయసులోనే ఆనుకోని ప్రమాదం కారణంగా వెన్నెముక విరిగిపోయింది. దీంతో ఎనిమిదేళ్ల పాటు మంచానికే పరిమితమైన ఆయన.. డ్యాన్సుపై మమకారం పెంచుకున్నారు. ఏకలవ్యుడిలాగా తనంతట తానే డ్యాన్స్ నేర్చుకున్నారు. అలా 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అప్పటికి వెన్ను నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఒక రోజు ఎవరో మీ అబ్బాయి డ్యాన్సులు వేస్తున్నాడని వాళ్ల నాన్నకు చెప్పేశారు.
అబద్ధాలు చెప్పడం శివశంకర్ తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నిజం చెప్పేశారు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ ఒకటే తిట్లు. ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశారు. ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడిగారు. ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట. ఆ తర్వాత జ్యోతిష్యులకు ఇంట్లోవాళ్లు శివశంకర్ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్ అవుతాడు’ అని చెప్పారట. దాంతో విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని.. మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్ నృత్యం నేర్చుకున్నారు. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత సలీమ్ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివ శంకర్ మాస్టర్ 8 వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు. మగధీరలోని ‘‘ధీర ధీర’’ పాటకు గాను శివశంకర్ మాస్టర్‌కు జాతీయ అవార్డ్ వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments