నేను అప్పుడే చెప్పా విడిపోతారని... సమంత-నాగచైతన్య జాతకాలపై వేణు స్వామి సంచలనం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పుడైతే సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో పేరు ముందు అక్కినేని అనే పదాన్ని తొలగించిందో అప్పటినుంచి ఈ జంటపై తెలుగునాట రూమర్స్ మొదలయ్యాయి. రోజు రోజుకూ ఈ వార్తల ప్రవాహం మరింత ఎక్కువ కావడంతో జనం ఫోకస్ అంతా చై-సామ్ విడాకుల వ్యవహారంపైనే పడింది. ఈ ఇద్దరూ ఇప్పటికే చాలా సార్లు ఫ్యామిలీ కోర్టుకు హాజరై కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారని వార్తలు వస్తుండటం, సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్న కొటేషన్స్, తిరుమలలో రిపోర్టర్ మీద సమంత చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఈ ఇష్యూపై ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. ఇంతలా పుకార్లు చక్కర్లు కొడుతున్నా నాగార్జున కానీ, స్వయంగా సామ్-చైతూలు కానీ ఈ వార్తలను ఖండించకపోవడంతో ఖచ్చితంగా తెరవెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అయితే నాగచైతన్య-సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. ఎలాంటి సమస్యలు అంటే వాళ్లిద్దరి మధ్య గ్యాప్ రావచ్చు.. విడిపోవచ్చు.. సంతానం కలగకపోవచ్చు.. పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయి అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అంటున్నారు. సమంత అమావాస్య నాడు పుట్టిందని.. దాని వల్ల చైతూకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది విశ్లేషించి చెప్పానని. సినిమాల పరంగా వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. బాగా రాణిస్తారు.. పెళ్లి చేసుకున్నా సమంత సినిమాల్లో కంటిన్యూ అవుతుంది’ అని వేణు స్వామి.. సమంత-నాగ చైతన్యల వైవాహిక జీవితం ఎలా ఉంటుందో పెళ్లికి ముందే అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు సమంత-చైతూ విడిపోతున్నారనే రూమర్లు రావడంతో ‘నేను చెప్పానుగా’ అంటూ మళ్లీ సీన్‌లోకి వచ్చి వైరల్ అవుతున్నాడు వేణు స్వామి.
నాగ చైతన్య, సమంత జాతకం నా దగ్గర ఉంది. మూడేళ్ల క్రితమే వీళ్ల గురించి నాగరాజు ఇంటర్వ్యూలో చెప్పాను. వీళ్ల విషయం అప్పుడు నేను చెప్పినట్టుగానే సీరియస్‌గానే ఉంది అని వేణుస్వామి అన్నారు. తనకు అక్కినేని ఫ్యామిలీ అంటే కోపం ఏం లేదని.. గతంలో అక్కినేని అఖిల్‌కి ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. ఆ టైంలో అది చాలా వెబ్ సైట్స్‌లలో రావడంతో నాగార్జున తన మీద కేసు వేస్తానని అన్నట్లు వార్తలు వచ్చాయని వేణుస్వామి అన్నారు. కానీ కొన్నాళ్లకు తాను చెప్పినట్టుగానే శ్రేయా భూపాల్‌తో అఖిల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది అని ఆయన గుర్తుచేశారు. ఇంతకీ సమంత నాగచైతన్య నిజంగానే విడిపోతున్నారా? అంటే గతంలో తాను ఏం చెప్పానో ఆ వీడియో చూడండని అంటున్నారు వేణు స్వామి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments