ప్రముఖ జ్యోతిష్యులు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కన్నుమూశారు. పలు టీవీలు, యూట్యూబ్ ఛానెల్స్, పేపర్ల ద్వారా జ్యోతిష్య శాస్త్రం గురించి వివరిస్తూ ఆయన తెలుగువారికి సుపరిచితులయ్యారు. ఆదివారం ములుగు రామలింగేశ్వర సిద్ధాంతికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రాగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్కు చేరుకునేలోపే ములుగు సిద్ధాంతి మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. రామలింగేశ్వర వరప్రసాద్ గత 30 సంవత్సరాల నుంచి శాస్త్రీయ పద్ధతులు, వాస్తు గురించి పరిపూర్ణంగా వివరించేవారు. ములుగు చెప్పిన జ్యోతిష్య ఫలితాలు దాదాపుగా నిజమవుతాయనే నమ్మకం కొంతమంది ప్రజల్లో ఉంది.
ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి వంశపారంపర్యంగా వస్తున్న జ్యోతిష్య విద్య ద్వారా జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపారు. ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మ జీవనాన్ని ప్రారంభించడానికి ముందు ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా ఆయన అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. సినీ నటులు ఏవీఎస్, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు. ములుగు సిద్ధాంతి మృతిపట్ల పలువురు ప్రముఖులు, ఆయన శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రేస్ కోర్స్ వద్ద వున్న శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments