మహేష్ కోసం అసెంబ్లీ సెట్...
Send us your feedback to audioarticles@vaarta.com
స్పై థ్రిల్లర్ `స్పైడర్`తో బిజీగా ఉన్న మహేష్ తర్వాతగా కొరటాల శివ దర్శకత్వంలో `భరత్ అను నేను`(రిజిష్టర్ చేసిన పేరు) సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అల్రెడి చిన్న పాటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మహేష్ కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటాడు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ అసెంబ్లీ సెట్‌ను వేయబోతున్నారట.
ఈ సినిమాలో మహేష్ ఓ పొలిటీషియన్ పాత్రలో కనపడబోతున్నారు. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com