MLA Jeevan Reddy : టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం... నిందితుడు మాజీ సర్పంచ్ భర్త
Send us your feedback to audioarticles@vaarta.com
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెం 12లోని వేమూరి ఎన్‌క్లేవ్‌లో జీవన్ రెడ్డి నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కత్తి, ఒక పిస్తోలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భార్యను సస్పెండ్ చేయించారనే కక్షతో:
నిందితుడిని ఆర్మూర్ నియోజకవర్గం మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ పెద్దగాని లావణ్య భర్త ప్రసాద్ గౌడ్‌గా గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ప్రసాద్ గౌడ్ కక్ష పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేని హతమార్చాలని అతను కుట్రపన్నినట్లుగా... దీనిలో భాగంగానే హైదరాబాద్‌కు వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని.. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బంజారాహిల్స్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టడం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి:
ఇకపోతే సీఎం కేసీఆర్ , కేటీఆర్‌లతో అత్యంత సన్నిహితంగా వుండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఒకరు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై ఆర్మూర్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిపై 13,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు జీవన్ రెడ్డి. ఆ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆకుల లలితపై 29,914 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments