ఆ విషయం నన్ను కాదు అబ్బాయిలనే అడగాలి - అనుపమ పరమేశ్వరన్
- IndiaGlitz, [Tuesday,October 04 2016]
అ ఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...చైతు ప్రేమమ్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో ప్రేమమ్ చిత్రంలో నటించిన అనుపమ, తెలుగు ప్రేమమ్ లో కూడా నటించడం విశేషం. నాగ చైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ హీరో, హీరోయిన్లుగా చందు మొండేటి తెరకెక్కించిన ప్రేమమ్ చిత్రం దసరా కానుకగా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ప్రేమమ్ అనుపమ పరమేశ్వరన్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
మలయాళం ప్రేమమ్ లో నటించిన మీరు, తెలుగు ప్రేమమ్ లో కూడా నటించారు కదా..! సేమ్ క్యారెక్టర్ చేసినప్పుడు బోర్ ఫీలయ్యేరా..?
మలయాళంలో నా క్యారెక్టర్ పేరు మేరి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుమ. అక్కడ క్రిస్టియన్ అయితే ఇక్కడ హిందు. నాకు కొత్తగా అనిపించింది. పైగా మలయాళ ప్రేమమ్ రిలీజై రెండు సంవత్సరాలు అయ్యింది. అందుచేత తెలుగు ప్రేమమ్ లో నటించడం బోర్ అనే ఫీలింగ్ కలగలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను.
చైతన్య తో నటించినప్పుడు ఎలా ఫీలయ్యారు..?
చై ఎప్పుడూ సైలెంట్ గా, సింపుల్ గా ఉంటారు. సెట్స్ లో చాలా సరదాగా ఉండేవాళ్లం. అందుచేత ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ సినిమాకి వర్క్ చేసాను.
తెలుగు ప్రేమమ్ లో చైతన్య, మలయాళ ప్రేమమ్ లో నవీన్ పాల్ ఇద్దరిలో ఎవరు బాగా నటించారు..?
అసలు చైతన్య, నవీన్ పాల్ ఇద్దరినీ ఎందుకు పోల్చి చూస్తున్నారు. ఎవరి నటన వారిది. ఇద్దరూ క్యారెక్టర్ కి తగ్గట్టు 100% బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా చైతన్య యంగ్ ఏజ్ లో చాలా బాగా నటించాడు.
డైరెక్టర్ చందు మొండేటి వర్కింగ్ స్టైల్ గురించి..?
చందు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రతి విషయాన్ని చాలా డీటైల్ గా చెప్పేవారు. ఆయనతో వర్క్ చేయడం అంటే హ్యాపీ.
మలయాళం ప్రేమమ్ కి, తెలుగు ప్రేమమ్ కి మార్పులు ఏమైనా చేసారా..?
నేను ఇంకా పూర్తిగా సినిమా చూడలేదు. నాకు తెలిసి ఫస్టాఫ్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. సెకండాఫ్ లో మార్పులు చేసారేమో.
మీ కెర్లింగ్ హెయిర్ చూసే అబ్బాయిలు మీతో లవ్ లో పడిపోతున్నారా..?
ఏమో..నాకు తెలియదు అది అబ్బాయిలనే అడగాలి (నవ్వుతూ..)
అఆ లో నాగవల్లి, ప్రేమమ్ లో సుమ ఈ రెండు క్యారెక్టర్స్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెబుతారు..?
మేన్ లి అంటే నాగవల్లి. హ్యాపీ అంటే సుమ.
చిన్న వయసులోనే సినిమాల్లో ప్రవేశించారు కదా...ఈ ఫేమ్, కెరీర్ గురించి మీకు ఏమనిపిస్తుంది..?
నిజం చెప్పాలంటే...నాకు ఏమీ అర్ధం కావడం లేదు. నేను ఇంకా కన్ ఫ్యూజన్ లోనే ఉన్నాను.
సినిమా అంగీకరించడానికి దేనిని దృష్టిలో పెట్టుకుని ఓకే చెబుతారు రెమ్యూనరేషనా..? మీ క్యారెక్టరా..?
నేను రెమ్యూనరేషన్ గురించి పెద్దగా పట్టించుకోను. నేను చేసే సినిమాలో కొత్తదనం ఏముంది..? నా క్యారెక్టర్ లో డెప్త్ ఉందా లేదా అనేదే ఆలోచిస్తాను.
ఈ సినిమాకి కూడా డబ్బింగ్ మీరు చెప్పారు కదా..! తెలుగు డబ్బింగ్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి..?
అ ఆ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పాను. మా గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నా వాయిస్ బాగుంటుంది డబ్బింగ్ చెప్పమంటే చెప్పాను. ఇక ఈ సినిమాకి కూడా డబ్బింగ్ నేనే చెప్పాను. ఇక డబ్బింగ్ చెప్పినప్పుడు ఫీలింగ్ అంటే...కొన్ని పదాలు డబ్బింగ్ చెబుతున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను.
శతమానంభవతి చిత్రంలో నటిస్తున్నారు కదా...షూటింగ్ ఎంత వరకు వచ్చింది..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని తణుకులో షూటింగ్ జరుగుతుంది. శర్వానంద్, జయసుధ గారు, నేను, ప్రవీణ్ తదితరులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాం. తణుకు ఏరియా నాకు చాలా బాగా నచ్చింది. మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది.
నాగచైతన్య ప్రేమలో పడ్డాడు ఈ విషయం మీకు చెప్పాడా..?
అవునా...! (నవ్వుతూ...) నేను చైతన్య సినిమాలను ప్రేమిస్తాడు అనుకుంటున్నాను..! (నవ్వుతూ..)
తెలుగు ఇండస్ట్రీ మీకు ఎలా ఉంది..?
తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుపట్టి నాగవల్లి, మేరి అని పిలుస్తుంటే చాల హ్యాపీగా ఉంది. ఇది గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
తెలుగులో శతమానంభవతి, తమిళ్ లో ఓ మూవీ చేస్తున్నాను. త్వరలో రిలీజ్ అవుతుంది. మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నాను.