ఆమెకు రీల్ లైఫ్ లో జరిగిందే రియల్ లైఫ్ లో జరనుందా?
- IndiaGlitz, [Monday,August 10 2015]
అసిన్..ఈ మలయాళ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గజనీ'తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సదరు హీరోయిన్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సరసన గజనీ' చిత్రంలో కూడా నటించి మెప్పించింది. అయితే బాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.
తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందని వార్తలు వినపడుతునాయి. ఈ అమ్మడు గజనీ' చిత్రంలో సంజయ్ అనే మొబైల్ కంపెనీ ఓనర్ తో ప్రేమలో పడుతుంది..అదే విధంగా నిజ జీవితంలో కూడా మైక్రో మ్యాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మను వివాహం చేసుకోనుందనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. అయితే ఈ విషయంపై అసిన్ వైపు నుండి, రాహుల్ శర్మ తరపునుండి కానీ కన్ ఫర్మ్ న్యూస్ రాలేదు. మరి వీరిద్దరూ ఈ విషయాన్ని ఔనంటారా? కాదంటారో చూడాలి...