ఆమెకు రీల్ లైఫ్ లో జరిగిందే రియల్ లైఫ్ లో జరనుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
అసిన్..ఈ మలయాళ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గజనీ`తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సదరు హీరోయిన్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సరసన గజనీ` చిత్రంలో కూడా నటించి మెప్పించింది. అయితే బాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.
తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందని వార్తలు వినపడుతునాయి. ఈ అమ్మడు గజనీ` చిత్రంలో సంజయ్ అనే మొబైల్ కంపెనీ ఓనర్ తో ప్రేమలో పడుతుంది..అదే విధంగా నిజ జీవితంలో కూడా మైక్రో మ్యాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మను వివాహం చేసుకోనుందనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. అయితే ఈ విషయంపై అసిన్ వైపు నుండి, రాహుల్ శర్మ తరపునుండి కానీ కన్ ఫర్మ్ న్యూస్ రాలేదు. మరి వీరిద్దరూ ఈ విషయాన్ని ఔనంటారా? కాదంటారో చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout