అసిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి..సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ అసిన్. అనతి కాలంలోనే బాలక్రిష్ణ, నాగార్జున,వెంకటేష్...ఇలా టాప్ హీరోలతో నటించిన అసిన్ గజినీ మూవీతో బాలీవుడ్ లో ప్రవేశించింది. అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. ఇక ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటుంది. మైక్రోమ్యాక్స్ కంపెనీ అధినేత రాహుల్ శర్మ తో ప్రేమలో పడిన విషయం తెలిసింది. ఆగష్టులో నిశ్చితార్ధం జరిగిన రాహుల్ శర్మ, అసిన్ పెళ్లికి డేట్ ఫిక్స్ చేసారు. నవంబర్ 26న న్యూఢిల్లీలోని 7 స్టార్ హోటల్లో పెళ్లి జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. అలాగే నవంబర్ 27వ తేదీన వెస్ట్ ఎండ్ గ్రీన్ ఫాంహౌస్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసారు. మరి పెళ్లి తర్వాత అసిన్ నటిస్తుందో..? లేదో..? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments