Asian Sunil:ఛార్మీ చెప్పినా తగ్గని వైనం.. కొనసాగుతున్న ఆందోళన, ‘‘లైగర్’’ డిస్ట్రిబ్యూటర్ల‌కు ఏషియన్ సునీల్ మద్ధతు

  • IndiaGlitz, [Tuesday,May 16 2023]

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ ‘‘లైగర్’’ డిజాస్టర్ కావడంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. నిర్మాతల సంగతి పక్కనబెడితే.. సినిమా హిట్ అవుతుందని భావించి.. దీనిపై పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భరించలేని నష్టాలను ఎదుర్కొన్నారు.. నేటికి ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు గతంలోనే పూరీ జగన్నాథ్ అంగీకారం తెలిపారు.

అందరికీ న్యాయం చేస్తానన్న చార్మీ :

బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ అయిపోయిందని.. వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న వేళ.. అనూహ్యంగా వీరంతా ధర్నాకు దిగడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. శుక్రవారం లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హైదరాబాద్ ఫిలింఛార్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు సైతం చేపట్టింది. తమను ఆర్ధికంగా ఆదుకుంటామని పూరి జగన్నాథ్ హామీ ఇచ్చారని.. ఈ మాట నిలబెట్టుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందోనని భావిస్తున్న వేళ .. లైగర్ నిర్మాత ఛార్మీ స్పందించారు. ఈ ఆందోళన విషయం తన దృష్టికి వచ్చిందని.. త్వరలోనే వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా తన సందేశాన్ని పంపారు. కానీ వీరు మాత్రం తమ ఆందోళన విరమించక కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నిర్మాత, ఏషియన్ గ్రూప్ అధినేత సునీల్ నారంగ్ మద్ధతు ప్రకటించారు. ఈ మేరకు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించారు.

కాగా.. విజయ్ దేవరకొండ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ వంటి వారు నటించడంతో లైగర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. దీనికి తోడు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో బొమ్మ అదిరిపోతుంతని అంతా భావించారు. తీరా లైగర్ రిలీజైన తర్వాత అందరికీ ఫీజులెగిరిపోయాయి. డివైడ్ టాక్‌తో ఎవ్వరిని ఈ చిత్రం సంతృప్తి పరచలేదు. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.60 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది.

More News

Anasuya:విమానంలో అనసూయ క్యారెక్టర్ ఇదే .. కళ్లకు కాటుక పెట్టి, ఒర చూపులతో పిచ్చెక్కిస్తోన్న రంగమ్మత్త

న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. యాంకర్‌గా, నటిగా ఎదిగారు అనసూయ భరద్వాజ్. తెలుగులో డిమాండ్ వున్న నటీమణుల్లో

Spy:'నేతాజీ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో మరణించడం ఒక కవర్ స్టోరీ' .. నిఖిల్ 'స్పై' టీజర్ వచ్చేసిందోచ్

ప్రస్తుతం ఇండియాలో ‘‘స్పై’’ జోనర్ల హవా నడుస్తోంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

Akhil Akkineni:ది బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాం .. కానీ : ఏజెంట్ డిజాస్టర్‌‌పై స్పందించిన అఖిల్

అక్కినేని కుటుంబంలో మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్.

Bengal Man:ఓ నిరుపేద దీనగాథ : అంబులెన్స్‌కు డబ్బుల్లేక , బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో దాచి 200 కి.మీ బస్సులో

శాస్త్ర , సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాలను సవాల్ చేస్తున్న పరిస్ధితుల్లో .. వచ్చే దశాబ్ధంలో

Globalstar Ram Charan:శెభాష్ : మండు వేసవిలో దాహార్తిని తీరుస్తున్న రామ్ చరణ్ అభిమానులు.. ఇది కదా నిజమైన సేవ..!!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్.