Asian Games:ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట.. ఆర్చరీలో బంగారు పతకం

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

ఆసియా క్రీడల్లో భారత్ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. పతకాల వేటలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జోత్యి సురేఖ- ఓజాస్ డియోటాలే జట్టు బంగారు పతకం సొంతం చేసుకున్నారు. దీంతో ఆసియా క్రీడల చరిత్రలోనే ఎక్కువ పతకాలు గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 2018లో జరిగిన గత ఎడిషన్‌లో 70 పతకాలు సాధించారు ఇండియా ప్లేయర్స్. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 71 పతకాలు కైవసం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పారు.

159-158 తేడాతో కొరియా జట్టుపై గెలిచిన సురేఖ- ఓజాస్ జట్టు..

ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగం ఫైనల్ మ్యాచులో దక్షిణ కొరియా జోడీ సో చెవాన్- జూ జేహూన్‌‌పై భారత జోడి జ్యోతి సురేఖ- ఓజాస్ డియోటాలే 159-158తో గెలుపొందారు. మ్యాచ్ ఆరంభం నుంచి రెండు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా పొరాడారు. మొదటి గేమ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 40-39 పాయింట్లతో నిలిచాయి. రెండో గేమ్ ముగిసే సమయానికి 80-79తో నిలిచాయి. కీలకమైన మూడో గేమ్‌లో ఒకానొక దశలో రెండు జట్లు 119-119తో సమంగా నిలిచాయి. చివరి వరకు తీవ్ర ఉత్కంఠంగా జరిగిన గేమ్‌లో 159-158తో కొరియా జట్టుపై భారత్ గెలిచి చరిత్ర సృష్టించింది.

భారత్‌కు ఇది 16వ బంగారు పతకం.. మొత్తంగా 71వ పతకం..

ఈ క్రీడల్లో భారత జట్టుకు ఇది 16వ బంగారు పతకం కాగా.. మొత్తంగా 71వ పతకం కావడం విశేషం. అలాగే భారత్ మరొక బంగారు పతకం గెలిస్తే ఓ సీజన్‌లో అత్యధిక బంగారు పతకాలు గెలిచిన భారత జట్టు గానూ రికార్డు నెలకొల్పనుంది. ఇక భారత్ ఇప్పటివరకు గెలిచిన 71 పతకాల్లో 16 గోల్డ్, 26 సిల్వర్, 29 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సీజన్‌లో మరిన్ని ఈవెంట్స్ ఉన్న నేపథ్యంలో మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది. క్రికెట్, బ్యాడ్మింటన్ విభాగాల్లోపనై భారత్‌కు బంగారు పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సీజన్‌లో మాత్రం భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు.

More News

Ramcharan:ముంబై సిద్ధి వినాయకుని ఆలయంలో రాంచరణ్.. అయ్యప్పస్వామి మాల దీక్ష విరమణ

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్‌గా నిలిచారు.

Sikkim:సిక్కింను ముంచెత్తిన భారీ వరదలు.. 23 మంది జవాన్లు గల్లంతు

ఈశాన్య రాష్ట్రమైన సిక్కింను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో లాచెన్ లోయలోని తీస్తా నది నీటిమట్టం

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్సీ టాస్క్.. శోభాశెట్టి చీటింగ్, ఏం మనుషుల్రా అంటూ శివాజీ అసహనం

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ చప్పగా సాగడంతో ప్రేక్షకులు నిరుత్సాహాపడ్డారు. బిగ్‌బాస్ షోను ప్రతి సోమవారం, వీకెండ్‌లలో ఎవ్వరూ మిస్ కారు.

Ram Charan:మరో గుర్రాన్ని కొనుగోలు చేసిన చరణ్.. నా కొత్త ఫ్రెండ్ అంటూ పోస్ట్, బ్లాక్ డ్రెస్‌లో గ్లోబల్ స్టార్ స్టైలిష్ లుక్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు సినిమాలు, వ్యాపారాలతో పాటు జంతువులతో గడపడం చాలా ఇష్టం .

Minister Roja:కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా.. మీ ఇంట్లో ఆడవాళ్లకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా..?

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు.