Bigg Boss 7 Telugu : తొలి రోజే శోభాశెట్టితో గొడవ.. వెక్కి వెక్కి ఏడ్చిన అశ్విని శ్రీ, ఇంటికెళ్లిపోతానంటూ గొడవ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో గత వారం డబుల్ ఎలిమినేషన్ జరగ్గా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. పాత వారి కంటే కొత్తగా వచ్చిన వారికి ఫుల్ పవర్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒకరకంగా చెప్పాలంటే పాతవారిపై పెత్తనం చేయొచ్చన్న మాట. అలాగే కొత్త వారు కొంచెం చలాకీగా, చురుగ్గా కనిపిస్తూ పాత వారికి పోటీ ఇచ్చేవారిలా కనిపిస్తున్నారు. ఇక సోమవారం నామినేషన్స్ డే కావడంతో ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తారన్న సంగతి తెలిసిందే. ఎపిసోడ్ మొదలయ్యాక కొత్తగా వచ్చినవాళ్లని పోటుగాళ్లు.. పాత వారిని ఆటగాళ్లు అని చెప్పాడు.
ఆపై ఆరో వారానికి నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ప్రతి కంటెస్టెంట్ తగిన కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాల్సి వుంటుంది. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ముఖం మీద క్రాస్ మార్క్ వేయాలి. అంతేకాదు.. తొలుత పోటుగాళ్లకు మాత్రమే నామినేట్ చేసే అవకాశం కల్పించాడు. అది కూడా పాత వాళ్లని మాత్రమే నామినేట్ చేయాలని ఆదేశించారు. దీంతో నయని పావని.. తేజ, అమర్‌దీప్‌లను, భోలే షావళి.. అమర్‌దీప్, సందీప్‌లను, అశ్విని.. అమర్‌దీప్, శోభాశెట్టిలను, పూజా మూర్తి .. తేజ, ప్రిన్స్ యావర్‌లను, అర్జున్ అంబటి.. సందీప్, అమర్‌దీప్‌లను నామినేట్ చేశారు.
అయితే వచ్చీరాగానే కొత్త పిల్ల అశ్విని పెంట పెట్టుకుంది. నామినేషన్స్ సమయంలో అమర్‌దీప్ స్వార్ధంతో ఆడుతున్నాడని, శోభాశెట్టి గ్రూపిజంతో ఆడుతోందని ఆరోపించింది. దీనికి డాక్టర్ మోనితకు కోపం వచ్చింది.. నేను ఎవరి గ్రూప్‌లో వున్నానంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ తర్వాత బట్టల విషయంలోనూ మరోసారి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శోభా తీరుపై అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంటికి తానే మహారాణిలో ఫీలవుతోందని.. ఇక్కడ రాజకీయాలు నడిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
పోటుగాళ్లు నామినేషన్స్ పూర్తయిన తర్వాత.. ఆటగాళ్లకు నామినేషన్స్ వేసే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. పోటుగాళ్లలో ఒకరిని, ఆటగాళ్లలో ఒకరిని నామినేట్ చేయవచ్చని సూచించాడు. దీంతో అమర్‌దీప్.. అశ్విని, యావర్‌లను, శోభాశెట్టి.. అమర్‌దీప్, అశ్వినిలను, శివాజీ... అమర్‌దీప్, పూజామూర్తిలను, తేజ.. సందీప్, నయని పావనిలను, ప్రియాంక.. తేజ, అశ్వినిలను , సందీప్.. తేజ, అర్జున్‌లను, యావర్ .. శోభాశెట్టి, పూజామూర్తిలను, ప్రశాంత్.. నయని పావని, అమర్‌దీప్‌లను నామినేట్ చేశారు.
ఇది ముగిశాక.. అశ్విని శ్రీ మరోసారి కన్నీటి పర్యంతమైంది. శోభాశెట్టి తనను నామినేట్ చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అందరూ తననే నామినేట్ చేస్తున్నారని.. ఇంటికెళ్లిపోతా, ఎలిమినేట్ చేసేయండి అంటూ గుక్కపట్టి ఏడ్చింది. ఆమెను ఎంతగా ఓదార్చినా వినలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments