వీళ్లంద‌రినీ ఆడించే సూత్ర‌ధారి ఎవ‌రు(`అశ్వ‌థ్థామ` ట్రైల‌ర్‌)

  • IndiaGlitz, [Friday,January 24 2020]

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'అశ్వథ్థామ'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 31న విడుదలవుతుంది. చిత్ర యూనిట్‌ ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు.

''రాక్షసుడిని, భగవంతుడిని చూసిన కళ్లు ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి...''
అని వార్నింగ్‌ ఇచ్చేలా ఉండే డైలాగ్‌తో అశ్వథ్థామ ట్రైలర్‌ను ప్రారంభమైంది. ఎవరో నలుగురు వ్యక్తులు మరో వ్యక్తిని చూసి త్వరలోనే ఈ చేప మీ ముందుంటాదయ్యా అనే డైలాగ్‌తో సదరు నలుగురు హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ చేసే వ్యక్తులు అనిపిస్తుంది. మరో కోణంలో హీరో నాగశౌర్యకి, అతని చెల్లెలంటే ఎంతో ఇష్టం. వారి మధ్య అనుబంధాన్ని చూపేలా సన్నివేశాలున్నాయి.

పోలీస్‌స్టేసన్‌లో ఎస్‌.ఐతో కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ ''నిన్న సాయంత్రం నుండి మా అమ్మాయి ఇంటికే రాలేదు'' అని భయంతో కంప్లయింట్‌ చేస్తుంటాడు. కానీ పోసాని వారి మాటలను పట్టించుకోకుండా నవ్వుతుంటాడు. మరో సన్నివేశంలో హీరో నడిచి వస్తుంటే అతని దగ్గరగా ఉన్న కారుపై ఓ అమ్మాయి పై నుండి పడి చనిపోతుంది.
మరో సన్నివేశంలో హీరో ఎదో కేసు ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటాడు.

''ఎటు వెళుతున్న మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు...వేటక్కుల్లా వెంటపడే జాలర్లు.. శకునిలాంటి ఓ ముసలోడు...వీళ్లందరినీ ఒకే స్టేజ్‌ మీద ఆడిస్తున్న ఆ సూత్రధారి ఎవరు?'' అంటూ హీరో నాగశౌర్య ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను చూడొచ్చు.

అలాగే హీరో ఎవరినో చేజ్‌ చేస్తూ వెళ్లే సన్నివేశాలు.. యాక్షన్‌ సన్నివేశాలను ట్రైలర్‌లో చూడొచ్చు.. ట్రైలర్‌ అంతా చూస్తుంటే ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన పరిస్థితులు.. హీరో కుటుంబానికి ఎదురైతే అతనెలా రియాక్ట్‌ అవుతాడనే విషయాన్ని తెలియజేసేలా ఉన్నాయి. మరి విలన్‌ ఆగడాలను అరడుగులా నారాయణాస్త్రంలాంటి మన అశ్వథ్థామ ఎలా అడ్డుకున్నాడో తెలుసుకోవాలంటే జనవరి 31 వరకు ఆగాల్సిందే... యాక్షన్‌ ప్రధానంగా సాగేఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్‌ సన్నివేశాలను అన్బరివులు చక్కగా డిజైన్‌ చేశారు. కొన్ని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథాంశాన్ని హీరో నాగశౌర్య అందించారు.

నాగశౌర్య, మెహరీన్‌ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్‌ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, బాగ్రౌండ్‌ స్కోర్‌: జిబ్రాన్‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డిజిటల్‌: ఎం.ఎస్‌.ఎస్‌. గౌతమ్‌, డైలాగ్స్‌: పరుశురాం శ్రీనివాస్‌, యాక్షన్‌: అన్బరివు, కొరియోగ్రఫీ: విశ్వ రఘు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బుజ్జి, నిర్మాత: ఉషా ముల్పూరి, కథ: నాగశౌర్య, దర్శకత్వం: రమణ తేజ.

More News

‘రోజా ప్రిన్సిపాల్.. జగన్ డీన్.. పీఈటీ పృథ్వీ!!’

ఇదేంట్రా బాబూ.. ఇంత తిక్క తిక్కగా ఉంది టైటిల్ అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే..

నాడు ఎన్టీఆర్.. నేడు వైఎస్ జగన్‌.. సేమ్ సీన్!!

ఇదేంటి.. టైటిల్ చూడగానే దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు నందమూరి తారకరామారావుకు..

రానా-తేజ కాంబోలో ‘RRR’!!!

ఇదేంటి.. ఆల్రెడీ కుర్ర స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను పెట్టి దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ‘RRR’ భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారుగా..

క‌రోనా వైర‌స్ ఎలా పుట్టిందో తెలిస్తే షాక‌వుతారు..?

ఇప్పుడు ప్ర‌పంచాన్ని ముఖ్యంగా చైనా దేశాన్ని భ‌య‌పెడుతున్న వైర‌స్ క‌రోనా. ఈ వైర‌స్ చైనాలోని ఉహాన్ న‌గ‌రంలో పుట్టింది.

‘అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ.. ఇప్పుడేమంటారు జనసైనిక్స్’

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీతో కలిసి అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలోని కమలనాథులతో భేటీ అయిన పవన్ కల్యాణ్..