'అశ్వథామ' మోషన్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం `అశ్వథ్థామ`. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని శౌర్యని చూడబోతున్నారు అభిమానులు. దీని కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేసి కండలు పెంచాడు శౌర్య. ఇటీవలే రిలీజైన మోషన్ పోస్టర్ చాలా క్రియేటివ్ గా ఉంది . ఈసారి శౌర్య ఎంచుకున్న కథాంశం ఎంతో ఛాలెంజింగ్ గా ఉండబోతోందని పోస్టర్ చెప్పింది. పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఫైట్ మాస్టార్ అన్బు ఆరివ్ ఫైట్స్ అందిస్తున్నారు.
ప్రతి ఇంట్లో ఒక అశ్వథ్థామ ఉంటాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కుర్రాడి కథ ఇది. మహాభారతంలో అశ్వథ్థామకు మా అశ్వథ్థామకు ఏవిధమైన సంబంధం ఉండదని దర్శకుడు ఇంతకుముందు మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కం టీజర్ గ్రిప్పింగ్ గా థ్రిల్లర్ మోడ్ లో ఆకట్టుకుంది. ఈ పోస్టర్ టీజర్ లో కలర్ గ్రేడింగ్ ఎంతో డిఫరెంట్ గా కొత్త టోన్ తో కనిపిస్తోంది. బీజీఎం- రీరికార్డింగ్ ఉత్కంఠ పెంచుతున్నాయి.
నగరం.. ఆ నగరంలో సర్రున దూసుకుపోయే చురుకైన కుర్రాడు.. విలన్లను చితక్కొట్టే కండబలం గుండె బలం ఉన్న కుర్రాడు.. ఇన్ని కోణాలు శౌర్య పాత్రలో కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ మించి నగరం మధ్యలో కపాల దీవిలాగా కనిపిస్తున్న ఆ గార్డెన్ బిల్డింగ్స్ ఏమిటో సస్పెన్స్ గా ఉంది. సముద్రంలో మత్స్యకారుల బోట్.. నగరంలో అమ్మాయి.. ఎత్తుకెళ్లిపోతున్న దొంగల బండి.. ఇదంతా ఏదో మర్మంలానే ఉంది. ఓవరాల్ గా పోస్టర్ ఎలివేషన్ విజువల్ పోర్ట్రేయింగ్ ఎంతో క్రియేటివ్ గా ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు రమణ చాలా క్రియేటివ్ గానే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని ఇది చూస్తే అర్థమవుతోంది
నటీనటలు.. నాగశౌర్య, మెహరీన్, పోసానికృష్ణమురళీ, సత్య, ప్రొయరమణ, వి.జయప్రకాష్, కిషోర్, ఎం.ఎస్. భాస్కర్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com