జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రాజీనామాపై క్లారిటీ వచ్చేసింది!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సహా పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఆర్టీసీ కార్మికులు.. ఒకట్రెండు కాదు ఏకంగా 52 రోజుల పాటు సమ్మె బాట పట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం దిగిరాకపోవడం.. ఒకట్రెండు సార్లు డెడ్‌లైన్ ఇచ్చినప్పటికీ కార్మికులు విధుల్లో చేరలేదు. మరోవైపు.. కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులిస్తుండటం.. అశ్వత్థామపై రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోవడం.. సొంత యూనియన్‌కు చెందిన కార్మికులే ఆయన్ను తప్పబడుతుండటం.. రోడ్డు మీదికొచ్చి ఎడాపెడా తిట్టేస్తుండటంతో చేసేదేమీ లేక ఆయన రాజీనామా చేసేశారని గురువారం ఒక్కసారిగా మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.
దీంతో అవునా.. ఆయనెందుకు రాజీనామా చేశారు..? కార్మికులు యుద్ధం చేస్తున్న ఈ టైమ్‌లో ఆయన రాజీనామా చేస్తే పరిస్థితేలంటి..? అని కార్మికుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఈ వ్యవహారంపై ఫస్ట్ టైమ్ నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను రాజీనామా చేస్తున్నట్లు కొన్ని చానెల్స్‌లో.. మరికొన్నింటిలో చేశానని వస్తున్న వార్తలు అవాస్తవాలే. నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించే వరకు పోరాటం కొనసాగుతుంది. రాజీనామాపై వస్తున్న ఊహాగానాలను కార్మికులు ఎవరూ నమ్మవద్దు’ అని అశ్వత్థామ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout