చిరుకేం తెలుసు..? పవన్ నటిస్తే కోట్లే.. అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించి.. మూడు రాజధానులుంటాయేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన చేసిన నాటి నుంచి రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో కమిటీలు వేయడం.. ఆ కమిటీలు నివేదికలు ఇవ్వడం జరిగిపోయాయ్.. కాగా మరో రెండు మూడ్రోజుల్లో మూడు రాజధానులపై అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా మూడు రాజధానులను సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద దిక్కు, మెగాస్టార్ చిరంజీవి స్వాగతించి మద్దతిచ్చారు. అయితే.. ఈ వ్యవహారంపై ఇంతవరకూ మరే టాలీవుడ్ నటీనటులు స్పందించలేదు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావిస్తూ.. పరోక్షంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పేరును ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నా మిత్రుడి హయాంలో..!
‘రాజధాని రైతులను చూస్తే ఆవేదన కలుగుతోంది. గ్రామాల్లో ఉన్నది పోలీసులు కాదు..పోలీస్ డ్రెస్‌లో ఉన్న గూండాలు. ఒక్కో ఇంటికి 10మంది పోలీసులు.. భూములిచ్చిన రైతులకు బహుమానమా?. మహిళలపై లాఠీచార్జ్ చేశారు.. ఏ సమాజంలో ఉన్నామో అర్ధం కావడం లేదు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నా మిత్రుడు.. ఆయన హయాంలో ఇలా జరగడం దురదృష్టకరం’ అని అశ్వనీదత్ వ్యాఖ్యానించారు.
చిరు విజ్ఞతకు వదిలేస్తున్నా..!
‘చిరంజీవి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారు..?. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం ఆయనకు తెలియదా?. పవన్‌కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారు.. సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరుకు తెలియదా?’ అని చిరుపై అశ్వనీదత్ ప్రశ్నల వర్షం కురిపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments