పవన్‌ను కలిసిన ఆషు.. నాలుగో పెళ్లికి సైతం సిద్ధమేనట..

  • IndiaGlitz, [Tuesday,March 02 2021]

‘బిగ్‌బాస్’ ఫేమ్‌లు వరుసగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలుస్తున్నారు. ఇటీవల బిగ్‌బాస్ ఫేమ్ హిమజ.. పవన్‌ని కలిసి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తాజాగా మరో బిగ్‌బాస్ ఫేమ్ ఆషురెడ్డి.. పవన్‌ని కలిసింది. తన దేవుడిని మళ్లీ కలుసుకున్నానంటూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. పవన్ దిగిన ఫోటోతో పాటు .. ఆయన తనకు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసి సంబరపడిపోతోంది ఆషు. గతంలో కూడా ఒకసారి పవన్‌ను ఆషు కలిసింది.

‘‘నా దేవుడు పవన్ కల్యాణ్‌ని మళ్లీ కలుసుకున్నాను. అతను నన్ను నా పచ్చబొట్టును జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు టీ ఆఫర్ చేశారు. రెండు గంటలు నాతో సంభాషించారు. ఈ అనుభూతి చాలా స్వీట్‌గా అనిపించింది. చాలా ఆనందంగా ఉన్నాను. వచ్చేసేటప్పుడు ఆయన నాకు స్వీట్ లెటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ నా ఫస్ట్ లవ్’’ అంటూ పోస్టు పెట్టి ఆషు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ పోస్టుతో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసింది.

ఆషు పోస్టుపై నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. రకరకాల ప్రశ్నలడుగుతూ తన అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘ఒకవేళ పవన్ కళ్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా’? అని ప్రశ్నించాడు. దీనికి ఆషు ‘ఓ ఎస్’ అని రిప్లై ఇచ్చింది. గతంలో ఆషు తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కళ్యాణ్ పేరును పచ్చబొట్టు పొడుపించుకుని హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాజాగా పవన్‌ని కలిసిన సందర్భంలో ఆయన తన టాటూ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించారని ఆషు వెల్లడించింది.

More News

పెట్రోల్ బాంబు మంటల్లో గాయపడిన ప్రముఖ హీరో

ప్రముఖ హీరో షూటింగ్‌లో గాయపడిన ఘటన ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఓ సన్నివేశం చిత్రీకరణలో

'ఏ1 ఎక్స్‌ప్రెస్'ను నిజానికి 40 రోజుల్లో తీశాం: సందీప్ కిషన్

హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. డెన్నిస్‌ జీవన్‌  కనుకొలను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.

చేతిలో బీర్ బాటిల్‌తో డ్రైవింగ్.. నలుగురి మృతి

మద్యం మత్తులో కారు నడిపి నలుగురి చావుకు కారణమయ్యాడో వ్యక్తి. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం అమ్మవారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్

గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

‘సారంగదరియా’ ఎంత హైపో.. అంతే విమర్శలు..

యూట్యూబ్ సెన్సేషన్.. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూస్.. లక్షల్లో లైక్స్.. తెలంగాణ పల్లె నుంచి పుట్టిన పురాతన ట్యూన్..